మూడేళ్ళలో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పూర్తి.. కేంద్రం సమ్మతి
23-02-202123-02-2021 10:56:33 IST
Updated On 23-02-2021 10:56:40 ISTUpdated On 23-02-20212021-02-23T05:26:33.990Z23-02-2021 2021-02-23T05:26:31.303Z - 2021-02-23T05:26:40.332Z - 23-02-2021

తెలంగాణకు మణిహారంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఎట్టకేలకు కేంద్ర ఫ్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సహా బీజేపే స్థానిక నాయకులు ఈమేరకు కేంద్ర రహదారులు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నుంచి స్పష్టమైన హామీ పొందారు. నిర్మాణం ప్రారంభమైన మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం కేంద్ర రహదారులు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కిషన్రెడ్డి నేతృత్వంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ కలసి రీజినల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించడంతో పాటు, ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని కోరారు. గడ్కరీతో భేటీ అయిన తర్వాత కిషన్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా ఈ రోడ్డు ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కి.మీ. దూరంలో 338 కిలోమీటర్ల మేర తెలంగాణకు మణిహారంలా ‘రీజనల్’రోడ్డు ఉంటుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్కు ట్రాఫిక్ తగ్గుతుందని, అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 40 శాతం మంది రాష్ట్ర ప్రజలు ఆర్ఆర్ఆర్ కనెక్టివిటీలో ఉంటారని చెప్పారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రమంత్రిని కోరామని.. రాష్ట్రం భూసేకరణ త్వరితగతిన చేపడితే కేంద్రం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారని కిషన్రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ. 17 వేల కోట్లలో భూసేకరణకు రూ. 4 వేల కోట్లు అవుతుందని, అందులో రాష్ట్ర వాటా కింద రూ.1,905 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాగపూర్–హైదరాబాద్–బెంగళూరు కారిడార్, పుణే–హైదరాబాద్–విజయవాడ కారిడార్లో జాతీయ రహదారి కనెక్టివిటీకి ప్రాముఖ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మూడేళ్లలోగా ఆర్ఆర్ఆర్ను పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు కిషన్రెడ్డి తెలిపారు. రెండు వారాలక్రితం టీఆర్ఎస్ ప్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు సంధించిన ప్రశ్నకు కేంద్ర రహదారులు, రవాణా మంత్రి సమాధానమిస్తూ రీజనల్ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలు స్వయంగా నితిన్ గడ్కరీని కలిసి హామీ పొందడటంతో గత ఆరే్ళ్లుగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా పలించినట్లేనని భావిస్తున్నారు.

ఎమర్జెన్సీపై రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. జవదేకర్ ఎద్దేవా
7 hours ago

ఆత్మహత్యకు ప్రయత్నించిన మాగంటి బాబు కుమారుడు
8 hours ago

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
9 hours ago

బీజేపీకి రైతుల పాపం ఊరికే పోతుందా
an hour ago

గ్రేటర్ మేయర్ ప్రేమ, అభిమానం కోసం.. నేను కుక్కలా పుడతా- వర్మ
8 hours ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
9 hours ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
10 hours ago

స్టాలిన్ ని ఓడిస్తా అంటున్న హిజ్రా
3 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
10 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
12 hours ago
ఇంకా