newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

హుజూరాబాద్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారా..?

13-10-202113-10-2021 08:58:52 IST
Updated On 13-10-2021 09:03:02 ISTUpdated On 13-10-20212021-10-13T03:28:52.548Z13-10-2021 2021-10-13T03:28:37.602Z - 2021-10-13T03:33:02.834Z - 13-10-2021

హుజూరాబాద్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.  ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ గెలుపును బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లను చేరుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని నిర్ణయించింది. హుజూరాబాద్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని జాతీయ అధినాయకత్వం కూడా కచ్చితమైన ఆదేశాలు జారీచేయడంతో ఆ దిశగా వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కార్యాచరణ ప్రణాళికలను రాష్ట్ర నాయకత్వం రూపొందిస్తోంది.

మరో వైపు టిఆర్ఎస్ పార్టీ సైతం తమ అభ్యర్థి ని గెలిపించడం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఉప ఎన్నిక ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. నియోజకవర్గం లోని ప్రతీ ఓటరు దగ్గరికి టిఆర్ ఎస్ కార్యకర్తలు చేరి ప్రభుత్వ పథకాల గురించి తెలియచెప్పేలా ప్రణాళిక రచించి ఆదిశగా ముందుకు సాగుతోంది. అయితే బిజెపి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ఆంక్షలు ఉన్నప్పటికీ అమిత్ షా ప్రచారానికి వస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఉప ఎన్నిక కోసం ఏకంగా కేంద్ర హోంమంత్రి రావడమంటే మామూలు విషయం కాదు. ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్టీ మరింత బలోపేతం కావడంలో ఎలాంటి సందేహం లేదు. అదే ఓటమి పాలయితే అంతకు మించి పార్టీకి నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

   26 minutes ago


ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

   5 hours ago


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

   8 hours ago


టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

   9 hours ago


ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

   21 hours ago


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

   21 hours ago


తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

   06-12-2021


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

   06-12-2021


భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

   06-12-2021


రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   04-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle