newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ‌లో పెరిగిన కులాల కంపు.. పోషిస్తోన్న పార్టీలు

31-03-202131-03-2021 11:38:10 IST
Updated On 31-03-2021 11:54:49 ISTUpdated On 31-03-20212021-03-31T06:08:10.655Z31-03-2021 2021-03-31T06:06:29.753Z - 2021-03-31T06:24:49.696Z - 31-03-2021

తెలంగాణ‌లో పెరిగిన కులాల కంపు.. పోషిస్తోన్న పార్టీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రాజ‌కీయం అంటే.. కులం. కులం అంటే రాజ‌కీయం. అనే ఎవ్వారం ఎప్ప‌టి నుంచో ఉంది. ఏపీలో ఇది కామ‌న్ గానే ఉంటుంది. ఏపీ స్టేట్ అంటే కుల రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉంటుంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కుల రాజ‌కీయాలు పెరిగాయి అనే విష‌యంలో ఎవ్వ‌రికీ ఎలాంటి డౌట్సూ ఉండ‌వు క‌దా. 

ఏదెలా ఉన్నా.. తెలంగాణ‌లో కులాలు.. కుల రాజ‌కీయాలు త‌క్కువే. మామూలుగా ఊళ్ల‌ల్లో కూడా కులాల గొడ‌వ‌లు కాస్త త‌క్కువ‌గా ఉంటాయి అనేది నిజం. కానీ.. రాజకీయాలు కులాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డం మొద‌లుపెట్టాక‌.. ఎంతైనా పాత ప‌ద్ద‌తుల‌కు బ్రేక్ ప‌డాల్సిందే క‌దా. ఇప్పుడు తెలంగాణ‌లో కూడా అదే జ‌రుగుతోంది. రాజ‌కీయం అంటే కులం.. కులం అంటే రాజ‌కీయం అన్న‌ట్లుగా ఉంది ఎవ్వారం. ముఖ్యంగా ఇప్పుడు సాగ‌ర్ బై పోల్ జ‌రుగుతోంది క‌దా. ఈ టైంలో కాస్త ఎక్కువైంది కుల రాజ‌కీయం. 

సాధార‌ణంగానే.. కాంగ్రెస్ అంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గం పెత్త‌నం ఎక్కువ‌గా ఉంటుంది అని. రెడ్డీస్ డామినేష‌న్ నడుస్తుంది అనే విష‌యం తెలిసిందే క‌దా. అందుకే.. వేరే పార్టీల్లో ఉన్న రెడ్డీస్ కూడా.. కాంగ్రెస్ వైపే చూస్తుంటారు. ఉన్న వారు కూడా పార్టీని వీడి వెళ్ల‌రు. అందులోనూ ఉమ్మడి న‌ల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ. ఇప్పుడున్న కాంగ్రెస్ లీడ‌ర్లలో పెద్ద‌వారంతా రెడ్డీసే.. వారిలో ఎక్కువ‌మంది ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా వారే. అందుకే.. సాగ‌ర్ లో జానారెడ్డిదే పై చేయి అనే టాక్ న‌డుస్తోంది. అక్క‌డ రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉండడం.. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన లీడ‌ర్ల చేతిలో ఎక్కువ ఓటు బ్యాంకు ఉండ‌డంతో.. త‌మ‌దే విజ‌యం అనుకుంటున్నారు.

అయితే.. ఇదే ప్లేస్ లో యాద‌వ సామాజిక వ‌ర్గం వారు ఎక్కువ‌గా ఉండడం వ‌ల్ల టీఆర్ఎస్ మాత్రం.. యాద‌వ సామాజిక వ‌ర్గం వారిపై ఇంట్ర‌స్ట్ చూపించింది. అందుకే.. నోముల అక్క‌డ గెలిచార‌ని.. ఆయన త‌ర్వాత కూడా ఆయ‌న సామాజిక వ‌ర్గం వారికే ఇవ్వాలి అనుకుని.. ఆయ‌న కుమారుడికి సీటిచ్చింది. అయితే ఇక్క‌డ ఆల్రెడీ టీఆర్ఎస్ నుంచి రెడ్డి సామాజిక వ‌ర్గం వారు సీటు ఆశించిన‌... రెడ్డి సామాజిక వ‌ర్గం వారికి ఇచ్చినా.. వాళ్లంతా జానారెడ్డికే ఓటు వేస్తారని.. యాద‌వ సామాజిక వ‌ర్గం వారు కూడా జారిపోయే ఛాన్స్ ఉంద‌ని.. ఆలోచించిన సీఎం కేసీఆర్.. మ‌ళ్లీ యాద‌వ సామాజిక వ‌ర్గం వారి ఓట్ల‌ను ఆక‌ర్షించాడానికి.. నోముల సింప‌తీ వ‌ర్క‌వుట్ కావ‌డానికి.. ఆయ‌న కుమారుడికి సీటిచ్చిన‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఇక పోతే.. రెడ్డీస్ ఓట్లు కాంగ్రెస్ కి ప‌డ‌తాయ‌నేది క‌న్ఫామ్ కాగా.. యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట్లు టీఆర్ఎస్ కి ప‌డ‌తాయ‌నేది క‌న్ఫామ్ కాగా.. మిగిలిన ఎక్కువ మంది ఓట‌ర్లు.. ఎస్టీలు కావ‌డంతో.. బీజేపీఏమో.. ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెంద‌ని లీడ‌ర్ కు సీటిచ్చింది. ఇలా చూస్తుంటే.. ఇది పార్టీల పోటీనా.. కులాల పోటీనా అనేది అర్దం కావ‌డం లేదంటూ.. పొలిటిక‌ల్ అన‌లిస్టులు లెక్క‌లు తేల్చ‌లేక‌పోతున్నారు. 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle