newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసుకి.. అక్షయ్ కుమార్ సినిమాకు ఏంటి సంబంధమంటే..?

13-01-202113-01-2021 15:17:50 IST
Updated On 13-01-2021 16:54:20 ISTUpdated On 13-01-20212021-01-13T09:47:50.148Z13-01-2021 2021-01-13T09:29:44.712Z - 2021-01-13T11:24:20.670Z - 13-01-2021

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసుకి.. అక్షయ్ కుమార్ సినిమాకు ఏంటి సంబంధమంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నాప్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేదో సినిమాలో చోటు చేసుకున్న ఘటనలా.. తామంతా ఐటీ అధికారులమంటూ చెప్పి కిడ్నాప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన బాలీవుడ్ సినిమాలో ఉన్నదే.. అయితే ఆ సినిమాలో కేవలం డబ్బులను మాత్రమే దోచుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ఏకంగా కిడ్నాప్ చేసేశారు. 

భార్గవ్ సోదరుడు చంద్రహాస్ కిడ్నాప్‌కు ముందు అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ అనే సినిమాని అఖిలప్రియకు మిగిలిన వారికి చూపించాడట. ఐటి అధికారులుగా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్‌లో చంద్రహాస్‌, అఖిలప్రియ అండ్‌ గ్యాంగ్‌కి కిడ్నాప్‌కు సంబంధించి శిక్షణ ఇచ్చాడు. అఖిలప్రియ ఆదేశాలకు అనుగుణంగానే కిడ్నాప్ చేయించినట్లు భార్గవ్, చంద్రహాస్ తెలిపారు. ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు, ఐడి కార్లను చంద్రహాస్‌ తయారు చేశాడు. శ్రీ నగర్ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్‌లను వీరు అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. 

బోయిన్ పల్లిలో జరిగిన ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అతన్ని ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కేసులో మొత్తం 19 మందిని నిందితులుగా పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకూ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా 11 మందిలో భార్గవ్ రామ్ తో పాటు, గుంటూరు శ్రీను తదితరులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిలో భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తుండగా.. మరో 10 మంది ఆచూకీపై పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాలకు వెళ్లిన తెలంగాణ పోలీసు బృందాలు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రమేయంపైనా పోలీసులకు ఆధారాలు అందినట్టు తెలుస్తోంది.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   6 hours ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   8 hours ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   8 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   13 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   14 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   15 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   16 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   17 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   18 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   18 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle