పువ్వాడపై బీజేపీ బాణం.. తానుతీసిన గోతిలో తానే పడేలా..!
10-01-202110-01-2021 22:02:00 IST
2021-01-10T16:32:00.688Z10-01-2021 2021-01-10T07:58:27.460Z - - 20-01-2021

పువ్వాడ అజయ్ కుమార్.. మంత్రి హోదాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన ఏదిచెబితే అదే శాసనం. రాజకీయ ఉద్దండులు తుమ్మల, పొంగులేటి, నామా లాంటివారిని సైతం పక్కకునెట్టి ఉమ్మడి జిల్లాలో తన హవాను సాగిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉండటంతో తనకు అడ్డొచ్చినవారినల్లా తొక్కుకుంటూ వెళ్తున్నారన్న వాదన జిల్లా వ్యాప్తంగా వినిపిస్తుంది. ఈక్రమంలోనే రాష్ట్ర స్థాయిలో పేరున్న ఓ ఉద్యోగ సంఘం నేతను పువ్వాడ పట్టుబట్టి మరీ సస్పెండ్ చేయించినట్లు ప్రచారం సాగుతుంది. సస్పెండ్ అయిన ఉద్యోగ సంఘం నేతను చేరదీసిన బీజేపీ.. ఆ నేతనే పువ్వాడపై యుద్ధానికి సిద్ధంచేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో విస్తృత ప్రచారం సాగుతుంది. సదరు ఉద్యోగ సంఘం నేతకు ఉద్యోగుల్లోనూ, ప్రజల్లోనూ మంచి పలుకుబడి ఉండటంతో రాబోయే కాలంలో పువ్వాడ అజయ్.. తాను తీసినగోతిలో తానే పడేలా బీజేపీ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ టీజీవో సంఘంలో ఏలూరి శ్రీనివాస్‌రావు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌కు ఏలూరికి విబేధాలు రావటంతో టీటీజీవో (ది తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం) ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలో చాపకింద నీరులా వారి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఏలూరి. అయితే పాలకవర్గాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ఉద్యోగ సంఘం నేతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో తనకంటూ ఏలూరి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్ అధ్యక్షుడుగాను ఉండి ఉద్యోగులందరికీ ఇళ్లు కేటాయించేలా కృషిచేశారు. ఉద్యోగ సంఘాల సహకార సొసైటీని సైతం ఏర్పాటు చేశారు. దీంతో ఏలూరి శ్రీనివాస్‌రావుకు ఉద్యోగుల్లో మంచి గుర్తింపు ఏర్పడింది.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులను ఏకం చేయడంలో ఏలూరిది కీలక భూమిక అనే చెప్పవచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేసిన ఘనత ఆయనకు ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాతసైతం ఖమ్మం జిల్లాలోనే భద్రాచలాన్ని ఉంచాలని ఆమరణ నిరాహార దీక్షకుసైతం దిగారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ దృష్టిలో ఏలూరి పడినప్పటికీ.. టీజీవోలో వర్గ విబేధాల కారణంగా.. ఏలూరికి యాంటీ వర్గం టీఆర్ ఎస్‌లో ఉండటం వల్ల శ్రీనివాస్‌రావును ప్రోత్సహించలేదనే టాక్ ఉంది. కింది స్థాయి నుంచి ఐఏఎస్‌ల స్థాయి వరకు ఉద్యోగులతో ఏలూరి శ్రీనివాస్‌రావుకు మంచి సంబంధాలు ఉన్నాయి. పదేళ్లపాటు టీఎన్జీవో నేతగా పనిచేసిన ఆయన గ్రూప్ -1 అధికారిగా రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్, చండ్రుగొండ, రఘునాథపాలెం తదితర ప్రాంతాల్లో ఎంపీడీవోగా పనిచేసిన సమయంలో తనదైన మార్క్ ను చూపి.. ఉద్యోగుల్లోనూ, ప్రజల్లోనూ ఏలూరి మంచిపేరు తెచ్చుకున్నారు.
ఖమ్మం జిల్లాలో కీలకంగాఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు ఏలూరి శ్రీనివాస్‌రావు అత్యంత దగ్గరి వ్యక్తి కావటంతో పువ్వాడ అజయ్ కుమార్ ఏలూరిని టార్గెట్ చేశారనే ప్రచారం సాగుతుంది. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయని ఇటీవల వార్తలు పలు పత్రికల్లో పుంకానుపుంకాలుగా రావటం వెనుక పువ్వాడ హస్తం ఉందనే వాదన వినిపించింది. ఈ క్రమంలోనే ఇటీవల జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య రీతిలో కార్పొరేటర్లను గెలుచుకోవటంతో ఏలూరి శ్రీనివాస్‌రావు..ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఇదే అదునుగా భావించిన పువ్వాడ అజయ్.. చండ్రుగొడలో ఎపీడీవోగా చేస్తున్న ఏలూరిని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు బదిలీ చేయించారనే వాదన ఉంది. అయితే తనకు బద్దశత్రువుగా భావించే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇలాకా కావడంతో అక్కడికి వెళ్లడానికి ఏలూరి మొగ్గుచూపలేదు.
ఈ క్రమంలోనే ఇటీవల ఖమ్మం పర్యటనకు వచ్చిన బండి సంజయ్, బీజేపీ నేతలు ఏలూరి శ్రీనివాస్‌రావు ఇంటికి వెళ్లిమరీ పరామర్శించారు. అన్ని విధాల బీజేపీ తరపున అండగా ఉంటామని సంజయ్ ఏలూరికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరికి మధ్య వారధిగా తుమ్మలకు బంధువు గరికపాటి రామ్మోహన్రావు ఉన్నారు. అంతేకాక ఉద్యోగ సంఘంలో కీలకంగా పనిచేసిన స్వామిగౌడ్‌కు ఏలూరికి మంచి సంబంధాలు ఉండటం ఏలూరిని బీజేపీకి మరింత దగ్గర చేసింది. పువ్వాడ అజయ్ కుమార్‌ది ఏలూరి శ్రీనివాస్‌రావుది ఒకే సామాజిక వర్గం కావటం, ఏలూరికి ఉద్యోగుల్లో, ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల్లో మంచిపేరు ఉండటంతో పువ్వాడ అజయ్ తీసిన గోతిలో తానే పడేలా చేసేలా బీజేపీ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి ఖమ్మం నియోజకవర్గం నుండి పువ్వాడపై పోటీకి ఏలూరి శ్రీనివాస్‌రావు దింపి గట్టి కౌంటర్ ఇచ్చేలా బీజేపీ అధిష్టానం దృష్టిసారించినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం సాగుతుంది.
ఏలూరి శ్రీనివాస్‌రావుకు తుమ్మల, పొంగులేటి, నామా నాగేశ్వరరావులతో మంచి సంబంధాలు ఉండటం, కమ్మం సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గం ముఖ్యనేతలతో మంచి సంబంధాలు ఉండటంతో పువ్వాడను ఢీకొట్టాలంటే ఏలూరి సరైన వ్యక్తి అనే భావనకు బీజేపీ అధిష్టానం వచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుండే ఏలూరిని కార్యరంగంలోకి దూకేలా చేసి.. ఎన్నికల సమయం నాటికి పువ్వాడకు గట్టిపోటీ ఇచ్చేలా బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అస్త్రాలతో బలంగా ఉన్న పువ్వాడ అజయ్‌ను బీజేపీ తయారు చేస్తున్న బాణం ఏమేరకు ఢీకొడుతుందో వేచిచూడాల్సిందే.

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి
an hour ago

కేటీఆర్ పరిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా
3 hours ago

జగన్ సర్కార్ మరో డెసిషన్.. ఎందుకు తీసుకుంటారో ఏమో
an hour ago

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా
4 hours ago

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే
5 hours ago

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?
5 hours ago

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!
6 hours ago

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట
6 hours ago

మితిమీరిన బూతులు.. కొడాలి నానీ రాజకీయాలకు అవసరమా?
6 hours ago

సంగారెడ్డిలో తోప్ సింగ్ కావాలని ఈ మాజీ ఎమ్మెల్యే ఆరాటం.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్
7 hours ago
ఇంకా