అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబస్తుగనే ఉంది..!
26-11-202026-11-2020 18:12:35 IST
Updated On 26-11-2020 18:15:46 ISTUpdated On 26-11-20202020-11-26T12:42:35.513Z26-11-2020 2020-11-26T12:42:21.218Z - 2020-11-26T12:45:46.240Z - 26-11-2020

బీజేపీ ఎక్కడా తగ్గడం లేదు. ఎలాగైనా సరే.. గ్రేటర్ పై జెండా ఎగరేసి.. గ్రేటర్ వయా.. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరేయాలని చూస్తోంది ఆ పార్టీ. అందుకే.. మేనిఫెస్టో లో కూడా బానే కవర్ చేసింది. సిటీని బేస్ చేసుకుని చాలా హామీలు ఇచ్చింది. కేటీఆర్ లాంటి లీడర్లు.. మా మేనిఫెస్టోనే రీ రైట్ చేశారు అని సెటైర్లు వేసినా.. వాళ్లు పావలా అంటే.. వీళ్లు రూపాయి పావలా అనడంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు.
బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంది..!
* అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ.... అవును కదా. ఇది కరోనా టైం కాబట్టి.. వర్కవుట్ అవుతుంది అనే ప్లాన్.
* పాత బస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ. నిజమే.. అక్కడ ఎలాగూ ఓట్లు రావు కాబట్టి.. అట్రాక్ట్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి. మరి ఆ ప్యాకేజీ ఏంటో కూడా చెబితే బావుండేదేమో. కదా.
* పాత బస్తీలో ప్రతి డివిజన్ కు 4 కోట్లకి తగ్గకుండా నిధులు.... మరి సిటీలోని మిగతా డివిజన్లకి ఏం ఇస్తారో కూడా చెబితే పోయేది కదా సార్.
* విద్యుత్ చోరీ కాకుండా చర్యలు.... ఇది జనాన్ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో మరి వాళ్లకే తెలియాలి. అటూ ఇటూ అయితే.. ఆ చోరీ చేసే వాళ్ల ఓట్లు పోతాయ్ తప్ప.. జనం మాత్రం దీన్ని పట్టించుకోరు.
* వీధి వ్యాపారులకు ఆరోగ్య భీమా.... ఇదేదో బావుంది. పాపం చాలామందికి హెల్ప్ అవుతుంది. అయినా.. హాస్పిటల్స్ డెవలప్ చేస్తే.. వీటితో పనేంటి.
* మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.... వాహ్, ఇది కదా.. జనాన్ని అట్రాక్ట్ చేసే పాయింట్ అంటే. మీరు గెలుస్తారు అనే కాన్ఫిడెన్స్ గానీ ఉంటే.. బానే ఓట్లేస్తారు కావచ్చు.
* మహిళల కోసం కిలోమీటర్ కో టాయిలెట్.... ఓకే గుడ్ అండ్ వెల్. బట్ మహిళలకు టాయిలెట్స్ అంటే.. మగాళ్లు గోడల పక్కన జిప్పులు ఓపెన్ చేయాలా సర్. ఇద్దరి కోసం కట్టిస్తే సిటీలో చాలా మంచిది. స్వచ్ఛ భారత్ కి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది కదా.
* గ్రేటర్ పరిధిలో టూ వీలర్లు, ఆటోలపై ఇప్పటి వరకూ ఉన్న చలాన్లు రద్దు..... అడ్డడ్డే, ఇది బెమ్మాండం సార్. ఇక ముందు చలాన్లు కూడా రద్దు చేస్తాం అంటే ఇంకా బావుండేదేమో. ఓకే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కారు కదా. ఇదే కరెక్ట్ లే.
* పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్... ఓకే గుడ్.
ఇలా చాలా ఉన్నయ్. గెలవాలి అనే కసితో ఇచ్చారా.. గెలవలేం లే అనే ధైర్యంతో ఇన్ని హామీలు ఇచ్చారా అనేది వదిలేస్తే.. అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు బానే చేశారు. కానీ.. ఇది జనంలోకి వెళ్లి నమ్మితే మాత్రం ఓట్లు బానే పడతయ్. తర్వాత బీజేపీకి తిప్పలు కూడా తప్పవు.
ఇది చదవండి: GHMC మేనిఫెస్టోలో కాంగ్రెస్ చావు బతుకుల పోరు

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
3 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
8 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
9 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
7 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
10 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
5 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
3 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
11 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
10 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
8 hours ago
ఇంకా