నేడు జనగామకి కమల దళాలు.. ఉద్రిక్తత తప్పదా?
13-01-202113-01-2021 08:27:01 IST
2021-01-13T02:57:01.205Z13-01-2021 2021-01-13T02:56:51.048Z - - 20-01-2021

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మాటలతో టీఆర్ఎస్ నాయకులను తెగ టెన్షన్ పెట్టేస్తూ ఉన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఇక తమ పార్టీ కార్యకర్తలకు ఏమైనా అయితే సైలెంట్ గా ఉంటారా చెప్పండి. ఇప్పుడు జనగామలో బీజేపీ కార్యకర్తల మీద లాఠీఛార్జ్ ఘటనపై బండి సంజయ్ తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. విచక్షణా రహితంగా బీజేపీ కార్యకర్తల లాఠీఛార్జ్ చేసిన సీ.ఐపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఏ రూపంలోనైనా డిజిపి కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. దమ్ముంటే అడ్డుకో అంటూ సవాల్ చేశారు. పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లో పనిచేస్తూ బీజేపీ కార్యకర్తల రక్తం కళ్లజూస్తున్నారని విమర్శించారు. ఇష్టానుసారం కేసులు పెడుతూ బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని... రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. మహనీయుల జయంతి,వర్దంతి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు రాకపోవడమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో స్వామి వివేకానంద ఉత్సవాలు కూడా జరుపుకోనివ్వరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏడాది కాలంగా పోలీసులు బీజేపీ కార్యకర్తల రక్తం కళ్లజూస్తున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం కాదని కానీ కొంతమంది పోలీసులు కేసీఆర్ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే బ్యానర్ల తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో స్థానిక సీఐ, పోలీసులు బీజేపీ నగర అధ్యక్షుడు పవన్ శర్మ, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ నేడు చలో జనగామకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తల రక్తాన్ని చెవిచూస్తున్న కొంతమంది పోలీసు అధికారులకు తగిన బుద్ధి చెపుతామని అన్నారు. వారిని ఒదిలే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో గడిలా పాలన అంతం అవుతుందన్న ఆయన రాష్ట్రంలో సీఎస్, డిజిపిలకే సీఎం కేసీఆర్ తో మాట్లాడే స్వేచ్ఛ లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కొడుకును తీసుకొని వచ్చి వీపు చింతపండు చేస్తే ఆ బాధ తెలుస్తుందని అన్నారు. జనగామకు కమల దళాలు వస్తూ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
2 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
3 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
5 hours ago

దేవినేని ఉమ విడుదల..!
7 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
7 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
7 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
10 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
11 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
13 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
14 hours ago
ఇంకా