newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

విశ్వనగరం కాదు.. వెనిస్ నగరం.. భట్టి విక్రమార్క ధ్వజం

18-10-202018-10-2020 13:30:37 IST
2020-10-18T08:00:37.292Z18-10-2020 2020-10-18T08:00:06.283Z - - 25-10-2020

విశ్వనగరం కాదు.. వెనిస్ నగరం.. భట్టి విక్రమార్క ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 72 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం పలు సందర్భాల్లో చెప్పారని, ఆ డబ్బంతా ఎక్కడ పోయిందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క నిలదీశారు. బారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్‌ మహానగరం వెనిస్‌ నగరంలా తయారైందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ సిటీని ఇస్తాంబుల్‌ చేస్తానంటే.. తన కుమారుడు మంత్రి కేటీఆర్‌ విశ్వనగరంగా మార్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిప్డడారు. 

ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పూర్తిగా వైఫల్యం చెందాయని అన్నారు. టీఆర్ఎస్ పాలన నుంచి నగరాన్ని కాపాడుకోవాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని భట్టి పిలుపునిచ్చారు. శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పంపులు అండర్ గ్రౌండ్‌లో వద్దని నిపుణుల కమిటీ వద్దని చెప్పిన ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. 

గత ప్రభుత్వంలో తమ ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ వినిపించుకోలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ వ్యవస్థ నిర్విర్యం అయ్యిందని, ఏడేళ్ల కింద రిటైర్డ్ అయిన వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.  ఈఎన్సీ మురళీధర్ రావు వల్ల ఇరిగేషన్ భ్రష్టు పట్టిందన్నారు. మురళీధర్ రావుపై సీబీఐ చేత విచారణ జరిపితే బాగోతం బయటపడుతుందని డిమాండ్‌ చేశారు. 

కల్వకుర్తి పంపులను చూడనీయకుండా తమను ఎందుకు ఆపుతున్నారని, తాము ఖచ్చితంగా వెళ్లితీరుతామని విక్రమార్క స్పష్టం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టు ఎల్లూరు వద్ద పంపుహౌజ్ నీట మునిగింది. అయిదు మోటార్లు నీట మునగటంతో భారీ నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతిక కారణాలతో వాటర్ లీకవ్వటంతో మోటార్లు మునిగాయని అధికారులు చెబుతున్నారు.

ప్రతిపక్షాలు మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టాన్నెల్ వద్ద జరుపుతున్న బ్లాస్టింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్ల నీటమునిగిన వ్యవహారం వివాదాస్పదమవుతుంది. సంఘటన స్ధలానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షపార్టీల నేతలకు పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు.

నీటమునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌తో పాటు అప్రోచ్‌ చానల్‌ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ల వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) పరిధిలోని పంపులు నీట మునిగాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. లిఫ్ట్‌లోకి నీళ్లు రావడానికి గల కారణాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులో అండర్‌ గ్రౌండ్‌ పంపుహౌస్‌ నిర్మిస్తే కల్వకుర్తి పంపుహౌస్‌ దెబ్బతింటుందని సీనియర్‌ ఇంజనీర్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బ్లాస్టింగ్‌ వల్లనే పంపుహౌస్‌లో డ్రాఫ్ట్‌ ట్యూబ్‌లను ఆనుకొని ఉన్న గోడల్లో పగుళ్లు వచ్చి మోటార్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. మూడో మోటార్‌ బేస్‌మెంట్‌ కూడా పగిలిపోయింది. సర్జ్‌పూల్‌ షట్టర్లు మూసివేసినా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అప్రోచ్‌ చానల్‌ గేట్లు మూసినా నీళ్లు వస్తున్నాయి. 95 మీటర్ల మేర పంపులు మునిగిపోయాయి. నీటి తోడివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ తగ్గితేనే నీటిని తోడటం సాధ్యమవుతుందని తెలుస్తోంది.  

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న కంపెనీ వారిని కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ వినియోగించే విధంగా పటేల్‌ కంపెనీ వారు కోరారు. ప్రస్తుతం పనులు చేపడుతున్న మెగా కంపెనీ ఇటీవల రెగ్యులర్‌గా నిర్వహించిన బ్లాస్టింగ్‌ల వల్లనే ప్రమాదం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా డీవాటరింగ్‌ చేస్తేనే నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle