బండ్ల గణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!
26-11-202026-11-2020 19:04:06 IST
Updated On 28-11-2020 13:14:46 ISTUpdated On 28-11-20202020-11-26T13:34:06.576Z26-11-2020 2020-11-26T13:34:01.218Z - 2020-11-28T07:44:46.353Z - 28-11-2020

ఊకోవయ్యా.. ఊరికే తు..తు..తు... అంటావ్ అని ఎవరినైనా అనాలంటే బండ్ల గణేశ్ నే అనాలేమో. లేదంటే ఊరుకుంటాడా చెప్పండి. తుత్తుతుతు అంటూనే ఉంటాడు. పాపం బండ్ల గణేశ్ ఏం మాట్లాడినా సరే..అందులో ఎంతో కొంత కామెడీ వెతుకుతారే తప్ప.. సీరియస్ గా మాత్రం తీసుకోరు. చివరికి చస్తానని చెప్పినా కానీ.. కామెడీ చేసి.. సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ కామెడియన్ గా మిగిలిపోయాడు బండ్ల గణేశ్. మరి అలాంటి లీడర్ పాలిటిక్స్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూశాం. సరదా తీరిపోయింది అనుకున్నాడు కావచ్చు. నాకొద్దురా భయ్ ఈ పాలిటిక్స్ అన్నాడు.. దండాలు దస్కాలు పెట్టాడు.. లాగించేశాడు. తన పని తాను చూసుకుంటున్నాడు. పెద్ద పెద్ద స్టార్లతో మూవీస్ చేస్తున్నాడు. అంతా బానే ఉంది. దుబ్బాక రిజల్ట్ వల్లనో.. గ్రేటర్ ఎన్నికల హడావిడి వల్లనో ఏమో తెలీదు కానీ.. మళ్లీ పూనకం వచ్చిందంట బండ్లకి. అందుకే.. మీడియాకి లీకులు వదిలాడు. బీజేపీలో చేరబోతున్నట్లు కాస్త లీక్స్ ఇచ్చాడు బండ్ల. అవున్ లే. అప్పుడంటే రాంగ్ గెస్ చేశా.. ఇక ముందు రోజులు బీజేపీవే అని బానే నమ్ముతున్నాడు కావచ్చు. బీజేపీ వేవ్స్ ని క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు. అంతా బానే ఉంది. తను వెళ్తానంటే ఆ పార్టీ కూడా వెల్కమ్ చెప్పొచ్చు సీటు గట్రా ఇవ్వొచ్చు కూడా. కానీ.. ఓ తిరకాసు ఉంది. ఆ తిరకాసంటే ఏం లేదండీ. బండ్లకి ఇంట్లో బ్యాండ్ బాజా మోగుతోదంట. నువ్వింకోసారి పాలిటిక్స్ గీలిటిక్స్ అంటే.. ఇంట్లోకి కూడా రానివ్వం అని ప్రేమతో తిడుతున్నారట. బాధ్యతతో కయ్యి కయ్యిమంటున్నారట. అప్పుడు పోయినోడివి అలాగే ఉండక గోల గోల చేసి వచ్చావ్. అలాగే ఉండి ఇప్పుడు బీజేపీలోకి పొయ్యుంటే బావుండేది.. నాకొద్దీ పాలిటిక్స్ అంటివి.. మళ్లీ ఇప్పుడు బీజేపీ అంటుంటివి.. అప్పుడు తగలేసిన డబ్బులు చాలవా.. మళ్లీ తగలేస్తవా అంటున్నారట. అయినా మనకెందుకు ఈ పాలిటిక్స్.. ఏవో వ్యాపారాలు చేసుకుంటూ.. సినిమాలు తీసుకుంటూ బతికితే మంచిగ ఉంటుంది కదా అని సలహాలు ఇస్తున్నారట. పాపం బండ్ల గణేశ్ బుంగమూతి పెట్టుకున్నాట్ట. అదీ కత.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
4 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
9 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
10 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
8 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
11 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
6 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
5 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
12 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
12 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
10 hours ago
ఇంకా