newssting
Radio
BITING NEWS :
రెండ్రోజుల్లో రామతీర్థానికి రానున్న విగ్రహాలు. టీటీడీ ఆధ్వర్యంలో సుందరంగా తయారవుతున్న విగ్రహాలు. * చెన్నైలోని క్రైస్తవ ప్రచారకుడి ఇంటిపై ఐటీ దాడులు. పాల్ దినకరన్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్న అధికారులు. చెన్నై కోయంబత్తూర్ సహా 28 చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు. * అమెరికా అధ్యక్షుడి స్థానంలో చివరిసారిగా ప్రసంగించిన ట్రంప్. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగిన దాడిగా చూడాలన్న ట్రంప్. ప్రజలకు చెప్పిన దానికన్నా ఎక్కువే చేశానని పేర్కొన్న ట్రంప్. * అమెరికా 46వ అధ్యక్షుడిగా నేడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం. ఉపాధ్యక్షురాలిగా అచ్చమైన భారతీయ వనితగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్. * అమరావతి ఉద్యమం చేపట్టి 400 రోజులు అయిన సందర్భంగా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధమైన దేవినేని ఉమా. గొల్లపూడిలో సభలు, దీక్షలకు అనుమతి లేదన్న పోలీసులు. * అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకూ విరాళాల సేకరణ. విరాళాల సేకరణ కోసం మిగతా కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్న బీజేపీ నేతలు. బోరబండ నుంచి విరాళాల సేకరణ ప్రారంభించిన బండి సంజయ్.

టీఆర్ఎస్ టార్గెట్ బీజేపీ కాదు.. బండి మాత్రమే?

08-01-202108-01-2021 11:48:54 IST
2021-01-08T06:18:54.391Z08-01-2021 2021-01-08T06:18:33.132Z - - 20-01-2021

టీఆర్ఎస్ టార్గెట్ బీజేపీ కాదు.. బండి మాత్రమే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ పార్టీ మీద.. టీఆర్ఎస్ నాయకుల మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చారు. బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలపై కొందరు టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ గా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేనట్లే కనిపిస్తోంది. హైకమాండ్ ఆదేశాల మేరకు సైలెంట్ గా ఉంటున్న టీఆర్ఎస్ నాయకుల మీద బండి సంజయ్ ఆరోపణలు ఏ మాత్రం తగ్గడం లేదు. టీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉన్నారని బండి సంజయ్ మరింత రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని.. వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లాయి బండి సంజయ్ వ్యాఖ్యలు. 

ఇక ఆలస్యం చేసే కొద్దీ కష్టమేనని భావించారో ఏమో ఇక టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ మీద మాటల యుద్ధం మొదలుపెట్టారు.  భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా బండి సంజయ్‌ను టార్గెట్ చేశారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్ వర్గాన్ని చాలానే ఇబ్బంది పెట్టాయి. బండి సంజయ్‌ గుడులు, బడులు, ఇండియా, పాకిస్తాన్‌ పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నికల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు. కేసీఆర్‌ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వల్లనే బండికి రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరీంనగర్‌కు అప్పటి ఎంపీ వినోద్‌కుమార్‌ త్రిబుల్‌ ఐటీ తీసుకొస్తే.. దానిని కర్ణాటకలోని రాయచూర్‌కు తరలించారని, ఎంపీగా ఉన్న బండి ఎందుకు అడ్డుకోలేకపోయారని టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. కేసీఆర్‌పై లేని పోని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులను విడిచిపెట్టేది లేదని అంటున్నారు. 

ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా బండి సంజయ్ ను టార్గెట్ చేసి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా బీజేపీని విమర్శించడం మానేసి బండి సంజయ్ ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇలాగే సైలెంట్ గా ఉంటే మొదటికే మోసం వస్తుందని భావించి ఇక బండి సంజయ్ మీద మాటల యుద్ధం మొదలు పెట్టారు టీఆర్ఎస్ నాయకులు. 

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి

   an hour ago


కేటీఆర్ ప‌రిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా

కేటీఆర్ ప‌రిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా

   4 hours ago


జ‌గ‌న్ స‌ర్కార్ మరో డెసిష‌న్.. ఎందుకు తీసుకుంటారో ఏమో

జ‌గ‌న్ స‌ర్కార్ మరో డెసిష‌న్.. ఎందుకు తీసుకుంటారో ఏమో

   2 hours ago


సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా

   4 hours ago


నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే

   5 hours ago


ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?

   5 hours ago


షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!

   6 hours ago


ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట

   7 hours ago


మితిమీరిన బూతులు.. కొడాలి నానీ రాజకీయాలకు అవసరమా?

మితిమీరిన బూతులు.. కొడాలి నానీ రాజకీయాలకు అవసరమా?

   7 hours ago


సంగారెడ్డిలో తోప్ సింగ్ కావాలని ఈ మాజీ ఎమ్మెల్యే ఆరాటం.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్

సంగారెడ్డిలో తోప్ సింగ్ కావాలని ఈ మాజీ ఎమ్మెల్యే ఆరాటం.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్

   7 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle