నోటి దురుసా.. స్పీడా.. టెంపరా.. బండి సంజయ్ లెక్కేంటి..?
06-01-202106-01-2021 11:54:39 IST
Updated On 06-01-2021 12:08:12 ISTUpdated On 06-01-20212021-01-06T06:24:39.331Z06-01-2021 2021-01-06T06:24:31.779Z - 2021-01-06T06:38:12.181Z - 06-01-2021

సూడుర్రి సూడుర్రి. పాలు పొంగి పొయ్ ల పడతయ్. అందుల నో డౌట్.. అనే వాళ్లు బండి సంజయ్ బండి వెనకాల చాలా మందే ఉన్నారట. మామూలుగా చూస్తే.. బండి సంజయ్ కి ఇప్పుడు మామూలుగా సాగడం లేదు. బండి బండికి బ్రేకేసే మొనగాడే లేడు అన్నట్లుంది ఎవ్వారం. మొన్నేమో.. అవున్ ర భయ్.. మాది బరా బర్ హిందువుల పార్టీనే అయితే ఏంది అన్నడు. ఎవరన్నా ఏమన్నా అన్నరా. కిక్కురు మనకుండా ఉన్నరు. అదే పార్టీలో ఉన్న వేరే వాళ్లు కూడా ఏం మాట్లాడలే. ఏమన్నా అంటే.. బీజేపీ హిందూ మతాన్ని ఫుల్ గా ఎంకరేజ్ చేస్తుంది అనే విషయం ఎవరికి తెలీదు చెప్పండి అంటారు. కాకపోతే.. మిగతా వాళ్లు అలా అనరు.. బండి సంజయ్ అంటడు అంతే తేడా. నిన్నటికి నిన్న.. ఏపీల కూడా ఇట్టాంటి మాటే అన్నడు బండి సంజయ్. బైబిల్ పార్టీ కావాలా.. భగవద్గీత పార్టీ కావాలా అంటూ గట్టిగనే మాట్లాడిండు. ఫుల్లు పబ్లిసిటీ వచ్చేసింది. ఇక్కడ కూడా కిక్కురు మన్నోళ్లు లేరు. సోషల్ మీడియాల రెండు రోజులు తిరిగిద్ది. అయితే ఏంది. తిరగాలనే కదా అనేది.. అసలు పాయింట్ అది. ఇక మతాలు.. దేవుళ్లు.. గుళ్లు.. ఇలా ఎన్నో.. అన్నీ బోర్డర్ లైన్ క్రాస్ చేసే మాట్లాడుతుంటరు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అయినా సరే.. బీజేపీల బండి సంజయ్ కి కాస్త తగ్గు అని చెప్పే లీడర్ లేరు. ఎందుకంటే.. సక్సెస్ మంత్రా ఇదేర భయ్ అని ఎవరినైనా నిలదీస్తరు బండి సంజయ్. ఎందుకంటే.. బండి పరుగులు పెడుతోంది కదా. ఎవ్వరైనా ఆపగలరా. ఆయనకట్టా సాగుతుంది.. సాగనియ్యండి అంటరు. ఇక సీఎం కేసీఆర్ విషయంలో కూడా బండి సంజయ్ ది దూకుడు ఎవ్వారమే. ఎంత మాట పడితే అంత మాట అనడంలో ఎక్కడా తగ్గరు బండి సంజయ్. అవ్వ.. అంత మాట అన్నారా అని.. ఆ మధ్య నోరెళ్ల బెట్టారు కానీ.. ఇప్పుడు అలవాటై పోయింది. ఇప్పుడు కూడా అంతే. తాగి పార్టీని నడుపుతున్నారు.. తాగి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అనేదాకా వెళ్లింది. రోజూ చూస్తూనే ఉన్నాం కదా ఇలాంటి కామెంట్లు. ఇందులో పెద్ద కొత్తదనం ఏమీ అనిపించకపోవచ్చు. కానీ.. మిగతా వాళ్లతో పోలిస్తే మాత్రం.. చాలా తేడా ఉంది. ఇదంతా చూస్తుంటే ఏమీ అర్దం కాదు. ఓసారి ఇది నోటి దురుసే అనిపిస్తుంటుంది. ఒక్కోసారేమో.. కాదు కాదు. ఇది టెంపర్ మెంట్ అంటారు. కొన్ని కొన్నిసార్లేమో.. బండి ఆ మాత్రం స్పీడ్ లేకపోతే.. కార్ ని ఎలా ఓవర్ టెక్ చేస్తుంది.. ఇది కచ్చితంగా స్పీడే అంటారు. ఏది నిజం.. ఏది కాదు అంటే ఎవరు మాత్రం ఏం చెప్పగలరు చెప్పండి. ఏమీ చెప్పలేరు. అది అనే ఆయనకైనా తెలియాలి.. పడే జనానికి, సీఎం కేసీఆర్ కి అయినా తెలియాలి ఆంధ్ర పాలిటిక్స్ లోకి బండి సంజయ్ ఎంట్రీ..

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
4 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
4 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
6 hours ago

దేవినేని ఉమ విడుదల..!
8 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
9 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
9 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
11 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
13 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
14 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
16 hours ago
ఇంకా