కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
13-01-202113-01-2021 17:45:19 IST
Updated On 13-01-2021 17:52:55 ISTUpdated On 13-01-20212021-01-13T12:15:19.275Z13-01-2021 2021-01-13T11:51:40.290Z - 2021-01-13T12:22:55.474Z - 13-01-2021

బీజేపీ కార్యకర్తలపై పోలీసులు చేసిన లాఠీఛార్జీతో జనగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే బ్యానర్ల తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో స్థానిక సీఐ, పోలీసులు బీజేపీ నగర అధ్యక్షుడు పవన్ శర్మ, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు చలో జనగామకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తల రక్తాన్ని చెవిచూస్తున్న కొంతమంది పోలీసు అధికారులకు తగిన బుద్ధి చెపుతామని అన్నారు. వారిని ఒదిలే ప్రసక్తే లేదని అన్నారు. చెప్పినట్లుగానే బండి సంజయ్ జనగామకు వెళ్లారు. జనగామ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి పోలీసుల లాఠీఛార్జిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలు పవన్ శర్మ తదితరులను ఆయన పరామర్శించారు. బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఉంచి, స్వామి వివేకానంద ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు పరామర్శించారు. తెలంగాణ డీజీపీపై ట్విట్టర్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ డీజీపీకి నా సూటి ప్రశ్న. నీ హయాంలో, నీ కమాండ్ కింద ఉన్న పోలీసు బలగాలు రాజ్యాంగ రక్షణ కోసం ఉన్నట్టా? లేదా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెప్పులుగా మారిండ్రా? స్వామి వివేకానంద సందేశాన్ని ప్రచారం చేస్తున్న వాళ్లని కొట్టడం రాజ్యాంగంపై మీకు ఎంత అంకితభావం ఉందో నిరూపిస్తోంది.. అని అన్నారు క్రిమినల్స్ ను, జేబు దొంగలను కూడా కొట్టనంత దారుణంగా స్వామి వివేకానంద జయంతి జరుపుకోవడానికి హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టినందుకు బీజేపీ కార్యకర్తలను కొట్టడం దారుణంమని అన్నారు ఆయన. టీఆర్ఎస్ రాజకీయ అజెండాను అమలు చేస్తున్న పోలీసుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నానని మురళీధర్ రావు చెప్పుకొచ్చారు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
6 hours ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
8 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
8 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
13 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
14 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
15 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
16 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
17 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
18 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
18 hours ago
ఇంకా