newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

15-05-202115-05-2021 08:07:55 IST
2021-05-15T02:37:55.504Z15-05-2021 2021-05-15T02:37:34.228Z - - 14-06-2021

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో ఏపీకి చెందిన అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే..! ఏపీ నుంచి కరోనా పేషెంట్లతో వస్తున్న అంబులెన్సులను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఆర్ఎస్ అధికారి గరిమళ్ల వెంకటకృష్ణారావు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాల ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుండడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ నుంచి కరోనా రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు వెళుతుండగా, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సాయంతో అంబులెన్సులను నిలిపివేసింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదంటూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అంబులెన్సులను ఆపొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. 

శనివారం నుండి అంబులెన్స్ లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేస్తుండడంపై ఇక్కడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్రమత్తమైన ప్రభుత్వం అంబులెన్సులను అనుమతించాలని నిర్ణయించింది. సూర్యాపేట జిల్లా రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద ఇప్పటి వరకు అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తివేశారు. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో రోగుల బంధువులు కాస్త కుదుటపడ్డారు. ఎలాంటి పాసులు, అనుమతి పత్రాలు లేకపోయినప్పటికీ.. పోలీసులు అంబులెన్సులను అనుమతిస్తున్నారు. అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ తీరును పలువురు తప్పుబట్టారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle