newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

కులపిచ్చి, ధన అహంకారమే హేమంత్ హత్యకు కారణమా ?

25-09-202025-09-2020 12:47:24 IST
Updated On 25-09-2020 13:18:16 ISTUpdated On 25-09-20202020-09-25T07:17:24.711Z25-09-2020 2020-09-25T07:17:21.672Z - 2020-09-25T07:48:16.177Z - 25-09-2020

కులపిచ్చి, ధన అహంకారమే హేమంత్ హత్యకు కారణమా ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య జరిగి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. అప్పట్లో ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇప్పుడు కూడా అదే సీన్ హైదరాబాద్ పరిధిలో రిపీట్ అయింది. తాజాగా భాగ్యనగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడి పరువు హత్య కలకలం రేపింది. చందానగర్ లో ఉంటున్న హేమంత్ అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన అవంతిని ప్రేమించి ఈ ఏడాది జూన్ 10వ తేదిన వివాహం చేసుకున్నారు. వారిద్దరి వివాహం యువతి కుటుంబానికి ఇష్టంలేకపోవడంతో గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలోనే నవ దంపతులు నివాసముంటున్నారు. 

కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతో రగిలిపోతున్న అవంతి తండ్రి.. హేమంత్ ను చంపేందుకు ప్లాన్ వేశాడు. పదకం ప్రకారం గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు హేమంత్ ను కిడ్నాప్ చేశారు. అర్థరాత్రైనా హేమంత్ ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. హేమంత్ కోసం వెతుకుతున్న పోలీసులకు శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో శవమై కనిపించాడు. 

తెలంగాణలో మరో పరువు హత్య..!

కొడుకు చనిపోయాడని తెలుసుకున్న హేమంత్ తల్లిదండ్రులు.. అవంతి కుటుంబ సభ్యులకు ప్రేమ పెళ్లి ఇష్టంలేకే తమ కొడుకుని దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. నిజానికి వాళ్ల కులం కన్నా, తమ కులమే ఎక్కువ అని, తమకు డబ్బు లేదన్న కారణంతోనే అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని హత్య చేయించారని హేమంత్ తండ్రి వాపోయారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తో పాటు వారి బంధువులైన సందీప్ ‌రెడ్డి, రాకేశ్ ‌రెడ్డి, రంజిత్‌ రెడ్డి, యుగేందర్‌ రెడ్డి, విజయేందర్‌ రెడ్డి లే తమ కొడుకుని దారుణంగా చంపేశారని ఆరోపించారు హేమంత్ తల్లిదండ్రులు

తన భర్త హత్య పై అవంతి స్పందించింది. చిన్నప్పటి నుంచి తామిద్దరం ఒకే ప్రాంతంలో పెరిగామని, ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న తాము జూన్ లో వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. పెళ్లికి ముందు తమ ప్రేమ విషయం తెలిసి 7 నెలల పాటు తనను ఇంట్లోనే ఉంచారని, ఆ తర్వాత వారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు పలుమార్లు బెదిరించినట్లు పేర్కొంది. తన తండ్రి తరపు వాళ్ల నుంచి అపాయం ఉండటంతో ముందుగానే పోలీసులతో మాట్లాడి రాజీ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది అవంతి. పోలీసులను ఆశ్రయించాక కూడా ఇంత దారుణానికి పాల్పడుతారని తాను ఊహించలేదని అవంతి కన్నీరు మున్నీరుగా విలపించింది. 

 

 

 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle