newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మొత్తం హరీశ్ రావే చేశారు

29-10-202029-10-2020 09:12:34 IST
Updated On 29-10-2020 19:55:54 ISTUpdated On 29-10-20202020-10-29T03:42:34.229Z29-10-2020 2020-10-29T03:42:29.665Z - 2020-10-29T14:25:54.390Z - 29-10-2020

మొత్తం హరీశ్ రావే చేశారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును. ఇది కాస్త ఇంట్ర‌స్టింగ్ గానే ఉంది. పార్టీ  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అలాగే ఉండాలి క‌దా అన్న‌ట్లే ఉంది మినిస్ట‌ర్ కేటీఆర్ మాట‌లు చూస్తుంటే. హ‌రీశ్ రావే చేస్తున్న‌ప్పుడు అత‌నికే క్రెడిట్ ఇవ్వ‌డంలో త‌ప్పేంటి అంటున్నారు కేటీఆర్. మీడియాతో జ‌రిగిన చిట్ చాట్ లో చాలా కామెంట్స్.. కాంప్లిమెంట్స్ ఇచ్చార మినిస్ట‌ర్ కేటీఆర్.

మీడియా ముందు మాట్లాడ్డం వేరు.. మీడియాతో చిట్ చాట్ వేరు. చాలా విష‌యాల‌ను బ‌య‌టికి చెప్ప‌క‌పోయినా.. లీక్ లిస్తారు. చాలా విష‌యాల్లో క్లారిటీస్ ఇస్తారు. అఫ్ కోర్స్.. చెప్పే విష‌యాలు అయినా స‌రే.. ముచ్చ‌ట్ల‌లో క‌లిసిపోత‌య్. దాన్నే క‌దా చిట్ చాట్ అంటాం. అలాగే ఈసారి కూడా మీడియాతో చాలా విష‌యాలు పంచుకున్నారు.. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దుబ్బాక‌లో క‌ష్ట‌ప‌డుతున్న హ‌రీశ్ రావే.. జ‌నంలో క‌లిసిపోతున్న‌ది హ‌రీశ్ రావే.. లీడ‌ర్ల‌ని ద‌గ్గ‌ర చేసుకుంటున్న‌దీ హ‌రీశ్ రావే.. అందుకే దుబ్బాక క్రెడిట్ అంతా హ‌రీశ్ రావుదే అంటున్నారు మినిస్ట‌ర్ కేటీఆర్

ఇక బీజేపీ పైనా కామెంట్లు చేశారు. జ‌నంలో త‌క్కువా.. సోష‌ల్ మీడియాల్లో ఎక్కువా ఉండే పార్టీ ఏదైనా ఉందీ అంటే అది బీజేపీ అంటున్నారు కేటీఆర్. జ‌నంలో ఉంటే ఓట్లేస్తారు కానీ.. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడితే ఓట్లు ప‌డ‌తాయా అంటున్నారు. జ‌నానికి ఆ మాత్రం తెలీదా అన్నారు. దుబ్బాక‌లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అనే విష‌యంలో మినిస్ట‌ర్ కేటీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక మీద కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ‌లో ఖాళీ అవుతుంది అన్నారు. లీడ‌ర్ల నుంచి కార్య‌క‌ర్త‌ల దాకా టీఆర్ఎస్ లో భారీ చేరిక‌లు ఉంటాయి అని హింట్స్ ఇచ్చారు.


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle