newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

మోడీ యువ‌త‌కు దూరం అవుతున్నారా

20-02-202120-02-2021 12:12:45 IST
Updated On 20-02-2021 09:54:03 ISTUpdated On 20-02-20212021-02-20T06:42:45.269Z20-02-2021 2021-02-19T18:57:30.035Z - 2021-02-20T04:24:03.347Z - 20-02-2021

మోడీ యువ‌త‌కు దూరం అవుతున్నారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సింపుల్ గా చెప్పుకుంటే మీడియా రెండు ర‌కాలు.. మీడియా, సోష‌ల్ మీడియా. మీడియా అన‌గానే అంద‌రికీ గుర్తొచ్చేది ప్రెస్ అండ్ మీడియా. ఈ రెండీటికీ డిఫ‌రెన్సుల ఎవ్వారం ప‌క్క‌న పెడితే.. ప్రెస్ అన్నా మీడియా అన్నా.. రెండూ ఒక‌టిగానే చూస్తారు. సో.. మీడియా అనుకుందాం. ఇక పోతే.. సోష‌ల్ మీడియా. ఇక సోష‌ల్ మీడియా గురించి చెప్పేదేముంది చెప్పండి. సో.. సోష‌ల్ మీడియా, మీడియా అంటే.. ప్ర‌చారానికి ప‌ర్ ఫెక్ట్ వాల్స్. ఈ రెండు పిల్ల‌ర్ల‌ని బ్రేక్ చేసి.. లెక్క చేయ‌కుండా మూవ్ అవ్వ‌డం అంటే.. ఎవ‌రికీ అంత ఈజీ ఏం కాదు. అలాంటిది.. ఈ రెండీటికీ అడ్డం తిరిగి.. ఏదో చేయాలి అని ప‌రిత‌పిస్తున్నారు పీఎం న‌రేంద్ర మోడీ.

అవును.. కాస్త వెన‌క్కి త‌గ్గి ఉంటే పోయేది. కానీ.. త‌గ్గ‌లేదు. లెక్క చేయ‌లేదు. రైతుల ఉద్య‌మం ఇప్పుడు కేంద్ర స‌ర్కార్ కి త‌గ్గ‌ని త‌ల‌నొప్పిగా మారింది. ఇదంతా అంద‌రికీ తెలిసిందే. అయితే.. యువ‌త‌కి ఎందుకు దూరం అవుతున్నారు మోడీ.. అనే పాయింట్ కి వ‌స్తే.. రైతుల ఉద్య‌మం ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతున్న‌ది.. సోష‌ల్ మీడియాలో. ఏదో న‌లుగురు సెల‌బ్రిటీలు రైతుల‌కు స‌పోర్టింగ్ మాట్లాడిన వారిపై సీరియ‌స్ అయినంత మాత్రాన ఉద్య‌మం ఆగ‌దు. బ‌య‌టి దేశం వారు.. రైతుల‌కి మ‌ద్ద‌తు ఇస్తే.. ఇండియాలోని ఓ ఐదారుగురు సెల‌బ్రిటీలు రివ‌ర్స్ అయ్యారు. మాది మేం చూసుకుంటాం.. మీది మీరు చూసుకోండి అన్నారు. వెంట‌నే ట‌పీ ట‌పీమ‌ని మొట్టికాయ‌లు ప‌డ్డ‌య్. ఇండియ‌న్ యూత్ మొత్తం సెల‌బ్రిటీల‌కి అడ్డం తిరిగింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా.. త‌లంటి పోశారు. వెంట‌నే కిక్కురుమ‌న‌కుండా కామ్ అయిపోయారు సెల‌బ్రిటీలు. 

ఇక‌పోతే.. మోడీ మీద మొదట్లో ఎక్కువ బిలీఫ్ ఉంది కూడా యూత్ కే. యూత్ స‌మ్ థింగ్ చేంజ్ కావాలి అనుకుంటేనే.. మోడీ పీఎం అయ్యారు. మీడియా అంటే పెద్ద‌లది.. సోష‌ల్ మీడియా అంటే యూత్ ది.. ఆ విష‌యంలో అంద‌రికీ క్లారిటీ ఉంది. మోడీ పీఎం అయ్యే టైంలో కూడా సోష‌ల్ మీడియాలో హీరో అయ్యారు. ఇప్పుడు అదే సోష‌ల్ మీడియా రైతుల‌కి స‌పోర్ట్ గా ఉంది. కానీ.. మోడీ మాత్రం.. సోష‌ల్ మీడియాని తొక్కేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

సో.. యూత్ కి కాస్త ఇరిటేటింగ్ గానే ఉంది సోష‌ల్ మీడియా ఎవ్వారం. దిశ ర‌వి అరెస్ట్ కూడా ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. సోష‌ల్ మీడియా, టూల్ కిట్ ద్వారా ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆమెపై దేశ ద్రోహం కేసు పెట్టి.. బెయిల్ ఇవ్వ‌కుండా పోలీసుల క‌స్ట‌డీకి పంపారు. సో.. ఏదో జ‌రుగుతోంది. ఇప్పుడు ఈ అరెస్ట్ ఇంకాస్త ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తుంది. ఆమె 21 ఏళ్ల వ‌య‌సున్న యంగ్ గ‌ల్. సామాజిక కార్య‌క‌ర్త‌.. సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్.. చూస్తుంటే.. ఈ విష‌యం ఇంకాస్త సీరియ‌స్ ట‌ర్న్ తీసుకునేలా ఉంది. సోష‌ల్ మీడియాలో..కేంద్ర స‌ర్కార్ ఇప్ప‌టికే విల‌న్ గా మారింది. రైతులను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు.. వాళ్ల గోడు ఎందుకు విన‌డం లేదు అంటున్నారు. చినికి చినికి గాలి వాన‌గా మారింది. ఇక తుఫాన్ గా.. త్సునామీగా మార‌డానికి పెద్ద టైమేం ప‌ట్టేలా లేదు.

హాట్ ఓవియా హాట్ కామెంట్స్ ఆన్ మోడీ

ఎవరీ ఆజాద్.. మోడీని కంటతడి పెట్టించేంత ఏముంది?!

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

   7 hours ago


కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

   9 hours ago


కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

   10 hours ago


వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

   10 hours ago


ఇదేం  అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

ఇదేం అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

   11 hours ago


రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి

   11 hours ago


హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత

   12 hours ago


ప‌వ‌న్ కి విశాఖ‌లో అడుగు పెట్టే ధైర్యం లేదా

ప‌వ‌న్ కి విశాఖ‌లో అడుగు పెట్టే ధైర్యం లేదా

   2 hours ago


ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న

   10 hours ago


డాక్ట‌ర్ చిరంజీవి కొల్లూరి క‌న్నుమూత..!

డాక్ట‌ర్ చిరంజీవి కొల్లూరి క‌న్నుమూత..!

   13 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle