newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

వారసత్వ రాజకీయాలు కొత్త నియంతృత్వ సంకేతాలు.. ప్రధాని మోదీ

13-01-202113-01-2021 18:13:29 IST
2021-01-13T12:43:29.133Z13-01-2021 2021-01-13T12:43:25.822Z - - 17-01-2021

వారసత్వ రాజకీయాలు కొత్త నియంతృత్వ సంకేతాలు.. ప్రధాని మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోని యువత రాజకీయాల్లో అడుగుపెట్టకపోతే వారసత్వ రాజకీయాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. వారసత్వ రాజకీయాలను కుటుంబాల్లోనే కొనసాగిస్తున్న వారికి చట్టంపై  గౌరవం కానీ, భయం కానీ ఏమాత్రమూ ఉండవని అదే అన్ని రకాల అవినీతికి మూలం అవుతోందని ప్రధాని పేర్కొన్నారు.

కేంద్ర యువజన వ్యవహారాల శాఖ, లోక్‌సభ సచివాలయం సంయుక్తంగా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో నిర్వహించిన రెండో జాతీయ యువజన పార్లమెంట్‌ ఉత్సవాల ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. వారసత్వ రాజకీయాలపై తీవ్రంగా విమర్శించారు. తమ సొంత కుటుంబాలలో వారసత్వ ఉదాహరణలను కొందరు చూస్తారనీ, అందువల్ల వారికి చట్టంపై గౌరవం గానీ భయం గానీ ఉండదు అని మోదీ చెప్పారు.

దేశంలో రాజకీయ సంస్కృతిని కాపాడాలంటే యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువని, వాటి అసమర్థత దేశానికి భారం అవుతుందని మోదీ హెచ్చరించారు. వారసత్వ రాజకీయాల అసమర్థత, చేతకానితనం నియంతృత్వానికి కొత్త రూపం ఇస్తుందని, దీన్ని అరికట్టడానికే యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు

ప్రధాని ఏ పార్టీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. గతంలో కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలపై ఇలాంటి విమర్శలే చేశారు. వారసత్వ రాజకీయాలు కూడా దేశంలో రాజకీయ, సామాజిక అవినీతి వెనుక దాగిన పెద్ద కారణాల్లో ఒకటి అని పేర్కొన్నారు. 

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యంలో కొత్త నియంతృత్వానికి దారితీస్తాయన్నారు. అన్నిటికంటే దేశం ముందు అనే భావనకు బదులుగా నేను, నా కుటుంబం అనే సెంటిమెంట్‌ను ఈ రాజకీయాలు బలోపేతం చేస్తాయి అని మోదీ హెచ్చరించారు. 

యువభారతం మార్పుకు వాహికలుగా మారాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత యువతమీదే ఉందన్నారు. భారత్ కోసం పనిచేయాలనే భావనతో యువత రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున రావాలని మోదీ పిలుపునిచ్చారు. సామాన్య ప్రజలు రాజకీయాల్లో భాగం కాకపోతే వారసత్వ రాజకీయాల సంస్కృతి కొనసాగుతూనే ఉంటుందని మోదీ హెచ్చరించారు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   6 hours ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   7 hours ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   8 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   12 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   14 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   15 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   16 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   17 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   18 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle