ఓ బండి కావాలా నాయనా
13-01-202113-01-2021 11:31:00 IST
Updated On 13-01-2021 11:54:55 ISTUpdated On 13-01-20212021-01-13T06:01:00.669Z13-01-2021 2021-01-13T05:57:42.886Z - 2021-01-13T06:24:55.988Z - 13-01-2021

ఏరా అబ్బాయ్.. క్లాస్ లో ఫస్ట్ వచ్చినవ్ గా.. ఆ వచ్చాలే నన్నారూ.. కరోనా టైం కదా.. ఏదో కలిసొచ్చింది. సరె సరెలే.. మొత్తానికైతే ఫస్టే వచ్చావ్ గా ఆ ఆ.. శాటిస్ఫాక్షన్ ఉన్నా లేకున్నా.. నేనే ఫస్టు మరి శాటిస్ఫాక్షన్ ది ఏముందిరా అబ్బాయ్.. ఫస్ట్ అంటే ఫస్టే.. అందుల తప్పేముంది. అవును నన్నారూ.. ఫస్టే వచ్చా. మరి పార్టీ చేసుకుంటున్నవా లేదా.. పైసల్ కావాలా. వద్దులెండి నాన్నారూ.. మరి బండి బండి అంటున్నవ్ కదా.. కొనమంటావా ఏంటి. వామ్మో వద్దు నాన్నోయ్.. ఏరా.. బండి వద్దు అంటావేంటి నాన్నారయో.. నీకు దండాలండయో.. నా బతుకు నన్ను బతకనీ.. ఆ డొక్కు సైకిల్ మీదనే రింగులు కొట్టుకుంట తిరుగుతా కానీ.. నాకా బండీ వద్దు గిండీ వద్దు నీకు దండాలు పెడతా. ఏంట్రా అబ్బాయ్.. మొన్ననే గర్ల్ ఫ్రెండ్ కూడా ఓకే చెప్పిందంట కదా. నాక్కూడా తెలిసిందేలే. ఎంచక్కా బండేసుకుని తిరగొచ్చు కదా. కొనుక్కో.. మంచి 200 సీసీ బండేదైనా చూసుకో.. లేదంటే 250 సీసీ అయినా పర్లేదు. కొనేద్దాం. పైసలొచ్చినయ్. 250 వద్దు.. 200 వద్దు. నా సైకిలేదో నేనేసుకుని పోతా. కావాల్నంటె ఒక కొత్త సైకిల్ కొనిపెట్టు.. కాలేజీకి ఏంచక్కా మేఘాల్లో తేలిపోతా. అదేంట్రా .. బండిమీద పిల్లనేసుకుని ఊరంతా జాలీగా తిరగరా.. సినిమాలకీ గట్రా పోరా అంటే.. సైకిల్ ఏసుకుని పోతా.. గిర్రు గిర్రున తిరుగుతా అంటవ్. మా రోజుల్లో బండ్లు లేక ఎంత ఇన్సల్ట్ ఫీలయ్యామో మాకు తెలుసు. ఇప్పుడు అందుకే.. నీకు ఆ బాధ లేకుండా చూడాలని చూస్తున్నా.. ఏం పర్లేదు బండేసుకుని పో. కొనిపెడతా. బాబూ నాన్నగారూ.. నీకు డబ్బులెక్కువైతే.. ఆన్ లైన్ లో పేకాట ఆడుకో.. లేదంటే ఏ గ్యాంబ్లింగో చేసుకో.. తప్పో ఒప్పో పోలీసులు ఊసుకుంటారు. నాకు మాత్రం బండి కొనీ మాక. ఏరా.. ఎందుకట్టా ఫిక్స్ అయ్యావ్. పిల్ల బండెక్కనన్నదా. పిల్ల బండెందుకు ఎక్కదు. ఊరంతా వంద సార్లు తిరగమన్నా తిరుగుద్ది. కానీ.. ఆమెను తిప్పడానికి బండొక్కటి ఉంటే సరిపోద్దా. పెట్రోల్ పొయ్యాలి కదా నాన్నారూ.. అదేంట్రా ..పాకెట్ మనీ ఇస్తాగా.. పోయించుకుని పో.. నువ్విచ్చే పాకెట్ మనీతో.. ఐస్ క్రీమ్ పార్లర్ కి వంద సార్లు తిరగొచ్చు.. బిర్యానీలు గట్రా బిర్రుగ తినొచ్చు.. పిజ్జాలు బర్గర్ లతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. నా పిల్లని షాపింగులు కూడా చేయించొచ్చు. కానీ.. ఈ పెట్రోల్ పోయించడం వీలు కాదు నాన్నారూ. అదేంట్రా అట్టా అంటవ్. అంత పెరిగిందా. పెరిగిందా ఏంది. 91 రూపాయలుంది లీటరు. నువ్వు కొనిచ్చే బండి 30 కిలోమీటర్లు వస్తది. అంటే.. 30 కిలోమీటర్లకి లీటర్ చొప్పున 91 రూపాయి అంటే.. కిలోమీటర్ కి మూడు రూపాయలు. కాలేజీకి పోయి.. పిల్లతో బైక్ పై షికారుకి పోతే.. రోజూ అలా తిరిగితే ఏం జరుగుద్దో తెలుసా. మంచిగ ఆటోలోనో సైకిల్ మీదనో పోతే.. మంచి మంచి గిఫ్టులు కొనిస్తున్నడు అనుకుంటుంది. నాకా బండీ వద్దు.. ఆ పెట్రోల్ కష్టాలూ వద్దు. మీకో దండం పెడతా.. నన్నిట్టా వదిలెయ్.. నువ్వు సైకిల్ కొనియ్యకపోయినా పర్లేదు. ఆ డొక్కు సైకిల్ నే మళ్లీ రిపేర్ చేసుకుంటా.. లేదంటే.. వెయిట్ లెస్ చెప్పులు కొనుక్కుని.. సరదాగా నా పిల్లతో రొమాంటిక్ వాకింగ్ కి వెళ్తాం. అది నయ్యం. మీకో దండం. ఉంటా మరి. కాలేజ్ లు ఓపెన్ అవుతున్నయ్ అంట. అట్ట పొయ్యొస్త.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
6 hours ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
7 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
8 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
12 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
14 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
15 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
16 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
17 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
18 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
18 hours ago
ఇంకా