newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

09-04-202109-04-2021 16:12:16 IST
2021-04-09T10:42:16.018Z09-04-2021 2021-04-09T10:42:05.104Z - - 15-05-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల కమిషన్ పదిసార్లు నాకు షోకాజ్ నోటీసు పంపినా సరే మతప్రాతిపదికన ఓటర్లను చీల్చే రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడి తీరుతానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. మతప్రాతిపదికన ఓట్లు గంపగుత్తగా తనకే వేయాలంటూ మమత మైనారిటీలను కోరారని తన దృష్టికి వచ్చిన ఆరోపణలపై ఈసీ స్పందించి రెండు రోజుల్లోగా సమాధానం చెప్పకపోతే మమతపై చర్య తీసుకుంటానని ఎన్నికల కమిషన్ హెచ్చరించిన నేపథ్యంలో ఒకటి కాదు.. పది నోటీసులు పంపుకోండి అంటూ మమత ధిక్కార స్వరం వినిపించారు. 

ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో పదే పదే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా స్పందించని ఈసీ తనకు నోటీసులమీద నోటీసులు పంపుతోందంటూ మమత దుయ్యబట్టారు. నరేంద్రమోదీ వివాదాస్పద ప్రకటనలపై ఎందుకు నోటీసు పంపలేదని ఈసీని మమత ప్రశ్నించారు. తానెన్నడూ మతపరంగా ఓటర్ల విభజనను ప్రోత్సహించలేదని మమత చెప్పారు.

మీరు నాకు పది షోకాజ్ నోటీసులు పంపించవచ్చు. కానీ నా సమాధానం ఒక్కటే. హిందూ, ముస్లిం అనే విభజన ప్రాతిపతిపదికన ఓట్లను చీల్చడానికి వ్యతిరేకంగానే నేను ఎల్లప్పుడూ మాట్లాడుతూ వచ్చాను. మత ప్రాతిపదికన ఓటర్ల విభజనను నేను ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చాను అని మమత వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి రోజూ హిందూ, ముస్లిం ఓటు బ్యాంకు గురించి మాట్లాడుతుంటే ఎందుకు తనపై ఫిర్యాదును ఈసీ స్వీకరించలేదు? నందిగ్రామ్ ప్రచారంలో మినీ పాకిస్తాన్ అంటూ పదే పదే వ్యాఖ్యానించిన వారిపై ఎందుకు ఫిర్యాదులను తీసుకోలేదు అంటూ తన ప్రత్యర్థి సువేందు అధికారిని ప్రస్తావిస్తూ మమత ఈసీని ప్రశ్నించారు.

కాగా ఏప్రిల్ 3న హుగ్లీలో మమత ప్రచారం చేస్తున్న సందర్భంగా మత ప్రాతిపదికన ఓట్లు వేయాల్సిందిగా మైనారిటీలను డిమాండ్ చేశారంటూ వచ్చిన ఆరోపణపై ఈసీ స్పందించి ఆమెకు షోకాజ్ నోటీసు పంపిన విషయం తెలిసిందే.

షోకాజ్ నోటీసుకు సమాధానం పంపకపోతే ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై ఐపీసీ 186, 189, 505 సెక్షన్ల కింద చర్య తీసుకుంటానని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.

పశ్చిమబెంగాల్‌లో 27 శాతం ముస్లిం ఓట్లు ఉన్నప్పటికీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎమ్ఐఎమ్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌లు ముస్లిం ఓట్లను చీలుస్తాయని, అది బీజేపీకే మేలు కలిగిస్తుందని ఆందోళనం చెందిన దీదీ ముస్లిం ఓట్లు చీలిపోకుండా అందరూ నాకే ఓటేయండి అని పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది.

బెంగాల్ చేజారింది.. వారణాసికి రండి దీదీ.. ప్రధాని మోదీ ఎద్దేవా

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle