newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒంటికాలితో బెంగాల్‌ని రెండుకాళ్లతో ఢిల్లీని వశపర్చుకుంటా.. మమత ప్రతిజ్ఞ

07-04-202107-04-2021 10:22:59 IST
2021-04-07T04:52:59.783Z07-04-2021 2021-04-07T04:52:44.019Z - - 11-04-2021

ఒంటికాలితో బెంగాల్‌ని రెండుకాళ్లతో ఢిల్లీని వశపర్చుకుంటా.. మమత ప్రతిజ్ఞ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బెంగాల్‌లో ఎన్నికల పోలింగ్‌ను నిలిపివేసే ఎలాంటి ప్రయత్నాన్నయినా తాము అడ్డుకుని తీరుతామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బెంగాల్లో 8 దశలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల కమిషన్ తీరుని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ఒకటి లేదా రెండు దశల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కానీ పశ్చిమబెంగాల్లో మాత్రం ఎన్నడూ లేనివిధంగా 8 దపాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. పైగా ప్రస్తుతం కోవిడ్-19 వైరస్ విజృంభిస్తోందని సాకు చెప్పి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను నిలిపివేయవచ్చు కూడా. కానీ నేను అందుకు అనుమతించను. బెంగాల్‌లో మొదలైన ఎన్నికలను పూర్తిగా నిర్వహించాల్సిందే అని మమత పేర్కొన్నారు.

గాయపర్చి నిలవరించలేరు. ఒంటికాలితోనే బెంగాల్‌లో గెలిచేస్తాం. మమత సవాల్

తన కాలిని గాయపర్చి ఎన్నికల ప్రచారానికి తనను దూరం పెట్టాలని బీజేపీ కుట్ర పన్నింది. కానీ ఒంటికాలితోనే తిరిగి నేను బెంగాల్లో గెలుపు సాధించబోతున్నాను. భవిష్యత్తులో రెండు కాళ్లతో తిరిగి ఢిల్లీలో కేంద్ర అధికారాన్ని కూడా గెలుచుకుంటాను అని మమత సవాల్ చేశారు. పుర్బా మెదినిపూర్ జిల్లాలో నందిగ్రామ్‌లో ప్రచారం చేస్తున్న మమత మార్చి 10న జరిగిన దాడిలో కాలికి తీవ్రగాయం తగిలిన విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొనకూడదనే దురుద్దేశంతోనే బీజేపీ కార్యకర్తలు నా కాలికి గాయం చేశారు. కానీ ఒంటికాలితో తిరిగి బెంగాల్‌ను గెలువబోతున్నానని, రేపు రెండుకాళ్లతో తిరిగి ఢిల్లీని కూడా గెల్చుకుంటాననే విషయం వారికి తెలీడం లేదు అని మమత వ్యాఖ్యానించారు.

కొంతమంది నేను ముస్లింలను బుజ్జగిస్తున్నానని ఆరోపిస్తున్నారు. కానీ రాష్ట్రంలో నేను ఉన్నంతవరకు హిందువులు, ముస్లింలు కలిసి జీవిస్తారని మాత్రమే ఇలాంటి వారికి నేను సమాధాం చెబుతున్నాను. హిందూ, ముస్లిం సామరస్యత కొనసాగని రోజు నేను బెంగా‌ల్లో ఉండలేను. ఉండబోను అని మమత తేల్చి చెప్పారు.

బెంగాల్‌లో భారీ పోలింగ్ పెరిగిన అంచనాలు.. గెలుపు నాదే దీదీ

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle