newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

23-04-202123-04-2021 11:54:00 IST
2021-04-23T06:24:00.100Z23-04-2021 2021-04-23T06:23:58.273Z - - 14-05-2021

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల దశలు చివరికి వచ్చే కొద్దీ ఓటర్లను ఆకర్షించే వాగ్ధానాల వర్షమూ తీవ్రమవుతోంది. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల హామీలను కోవిడ్ మలుపు తిప్పారు. వచ్చే నెల 5వ తేదీన ఫలితాలు వెలువడిన తరువాత రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తానని తపన్ ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రకటించారు. వచ్చే నెల రెండున అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, 5వ తేదీ తరువాత ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని ఆమె అన్నారు.   

కోవిడ్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో మందుల ధరలు ఇష్టా రాజ్యంగా ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై విరుచుకు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ ఉచితంగానే ఇస్తామని చెప్పడం ద్వారా చివరిదశ పోలింగ్ ను తన వైపు తిప్పుకునేందుకు మమత ప్రయత్నించినట్లు అయ్యింది. దేశవ్యాప్తంగా కోవి షీల్డ్ వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్న సీరం సంస్థ మూడు రకాల రేట్లను నిర్ణయించడం విమర్శలకు ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేతి సోనియా కేంద్రానికి లేఖ రాశారు.   

ఇప్పుడు మమతా బెనర్జీ ఏకంగా ఉచితంగానే వ్యాక్సిన్ ను ప్రజలకు అందిస్తామని ప్రకటించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే అర్హత వయో పరిమితిని 18 సంవత్సరాలకు తగ్గించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేయడంతో దిగివచ్చిన కేంద్రం మే 1 తేదీ నుంచే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేస్తామని ప్రకటించింది. అలాగే వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగానే దీనిని సమకూర్చుకునేందుకు వీలుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను సరళతరం చేసింది. ప్రయివేటు ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత ధరలు చెల్లించి తమకు అవసరమైన పరిమాణంలో వ్యాక్సిన్ ను సమకూర్చుకోవచ్చు.  

ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ లో 7వ దశ పోలింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వీడియో ప్రసంగం చేస్తారని బిజెపి వర్గాలు తెలిపాయి. అన్ని రకాల ర్యాలీలను, బహిరంగ సభలను కమిషన్ నిషేధించడంతో దానికి అనుగుణంగానే అన్ని పార్టీలు తమ ప్రచార సరళిని మార్చుకున్నాయి.  

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   15 minutes ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   an hour ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   20 hours ago


కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

   13-05-2021


కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

   13-05-2021


రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

   13-05-2021


నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

   a day ago


విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

   12-05-2021


అంతా కేంద్ర పెత్తనం వల్లే !  ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle