newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి

11-04-202111-04-2021 12:02:28 IST
Updated On 11-04-2021 12:02:24 ISTUpdated On 11-04-20212021-04-11T06:32:28.003Z11-04-2021 2021-04-11T06:29:27.624Z - 2021-04-11T06:32:24.731Z - 11-04-2021

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ ఎన్నికల కాకమీద ఉన్న పశ్చిమబెంగాల్‌లో హింస ప్రజ్వరిల్లింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక శనివారం అతిపెద్ద హింసాకాండ చోటు చేసుకుంది. నాలుగోదశ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా జరిగిన అనూహ్య ఘటనలో సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు చనిపోయారు. భద్రతా సిబ్బందిపై అల్లరి మూక దాడి చేసి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం జవాన్లు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించారు. ఆ నలుగురూ తమ మద్దతుదారులే అని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా కూచ్‌బెహార్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో కొంతమంది దుండుగులు యువ ఓటర్‌ని కాల్చి చంపారు.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగో దశ పోలింగ్ మొదలైన కొన్ని గంటలకే సితాల్ కుచీ నియోజకవర్గం పరిధిలోని మాతా భంగా పోలింక్ కేంద్రం వద్ద శనివారం ఉదయం 9.40 గంటలకు కాల్పులు జరిగాయి. ఓట్లు వేయడానికి వచ్చిన వారిపై కొందరు మొదటగా రాళ్లు రువ్వారని, భద్రతాసిబ్బందివైపుకు దూసుకురాగా వారిని చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరిపామని సీఎఎస్ఎఫ్ సిబ్బంది చెప్పారు. కాల్పులకు కూడా వెరవకుండా తమపైకి దూసుకొచ్చి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణతోపాటు ఎన్నికల సిబ్బందిని రక్షించడానికి భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో  నలుగురు మరణించగా, మరో నలుగురికి బుల్లెట్ గాయాలు తగిలాయని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

దాడికి వచ్చిన దుండుగులు కేంద్ర బలగాలకు చెందిన క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ వాహనాన్ని ధ్వంసం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4 మృతదేహాలను అధికారులు సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా కూచ్‌బెహార్‌ జిల్లాలో సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలో మొదటిసారి ఓటు వేసేందుకు వచ్చిన ఆనంద బర్మన్‌‌ను పఠాన్‌తులీలో 85వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌ బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బర్మన్ వయసు 18 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో బర్మన్‌ మరణించాడు.

సితాల్‌కుచీ నియోజకవర్గంలోని 1265 పోలింగ్‌ బూత్‌ వద్ద కాల్పులు జరగడం, నలుగురు మరణించడంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ వెంటనే పోలింగ్‌ను నిలిపివేశారు. రీపోలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో నాలుగో దశలో 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి.  సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. 15,940 పోలింగ్‌ కేంద్రాల్లో జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు. హింసాత్మక వాతావరణం పెరిగిన నేపధ్యంలో అయిదో దశ ఎన్నికల్లో సైలెన్స్ సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు పెంచిన ఎన్నికల కమిషన్ ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

ఎన్నికల పోలింగ్ మధ్యలోనే హింస పేట్రేగడంతో పశ్చిమబెంగాల్‌కు అదనంగా 71 కంపెనీల కేంద్రబలగాలను వెంటనే తరలించాలని ఎన్నికల సంఘం కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బెంగాల్ ఎన్నికల విధుల్లో వెయ్యి కంపెనీల బలగాలు విధుల్లో ఉండగా, అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలను తరలించనున్నారు.

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   6 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle