newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

08-03-202108-03-2021 14:48:11 IST
2021-03-08T09:18:11.839Z08-03-2021 2021-03-08T09:14:47.726Z - - 11-04-2021

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌కు కష్టకాలాల్లో ఆదుకున్న శక్తిగా వామపక్షాలకు ఇంతకాలం ఉంటూ వచ్చిన గుర్తింపు ఇప్పుడు తలకిందులయిందా.. పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో వామపక్షాలను తేలాలన్నా మునగాలన్నా అది కాంగ్రెస్ చేతుల్లోనే ఉందా.. నరేంద్రమోదీ ప్రాభవం ముందు రోజురోజుకూ గిడసబారిపోతున్న కాంగ్రెస్ పార్టీ వామపక్షాల మనుగడను నిలబెట్టే పరిరక్షప పాత్ర పోషించనుందా.. ప్రశ్నల మీద ప్రశ్నలన్నింటికీ సమాధానం ఔను అనే చెప్పాల్సి వస్తుందేమో.

వామపక్షాల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాగా మారిపోయింది. 

ఒక రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కరచాలనం చేయడం.. మరో రాష్ట్రంలో అదే పార్టీపై కత్తులు దూస్తూ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగాల్సి రావడంతో లెఫ్ట్‌ పార్టీల కార్యకర్తలకు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఒక చోట నిలబెట్టుకోవాలి, మరో చోట పునర్‌వైభవం సాధించాలి అనే స్థితిలో కొట్టుమిట్టులాడుతున్న వామపక్ష పార్టీలను అటు తేల్చడమైనా, ఇటు ముంచడమైనా ఇప్పుడు కాంగ్రెస్‌ చేతుల్లోనే ఉందనడం నిజం.

కేరళలో, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న రాజకీయ వైచిత్రి అనే సుడిగుండంలో పడి వామపక్షాలు నలుగుతున్నాయి. కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీని కట్టడి చేయాలి, పశ్చిమ బెంగాల్‌లో తిరిగి పట్టు సాధించాలంటే కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేయాలి. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ వైచిత్రిని ఎదుర్కోవడమే ఇప్పుడు వామపక్ష పార్టీల ముందున్న అసలు సిసలు సవాల్‌గా మారింది.  

అసోం, తమిళనాడు, పాండిచ్చేరితో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠను పెంచుతున్న పశ్చిమ బెంగాల్, కేరళలో ఎన్నికల వేడి రాజుకుంది. 2016లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలప్రయోగంగా నిలిచినప్పటికీ  ఈ సారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తోనే కలిసి వామపక్షాలు ఎన్నికల బరిలో దిగాయి.

అయితే  బెంగాల్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్‌–లెఫ్ట్‌ కూటమి నిర్వహించిన మెగా ర్యాలీకి జనం వెల్లువెత్తినప్పటికీ కాంగ్రెస్‌ అగ్రనేతలెవరూ హాజరుకాలేదు. కేరళలో యూడీఎఫ్‌ కూటమి విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, బెంగాల్‌లో వామపక్ష నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్‌ నేతలే ర్యాలీకి హాజరయ్యారు. 

ఇదిలా ఉండగా మరోవైపు కేరళలో వామపక్షాల నేతృత్వంలోని అధికారి ఎల్‌డీఎఫ్‌కు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది.  కేరళలో వామపక్ష పార్టీలను ఓడించడానికి కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో తెరవెనుక అవగాహనతో పని చేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీ ఓటమి కోసం పని చేయాల్సిన కాంగ్రెస్‌ ఇలా చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. 

కొత్తదారి పట్టిన వామపక్షాలు.. వివాదంలో మునక

భారతీయ జనతా పార్టీని ఓడించడానికి  కాషాయ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యమవ్వాలని పిలుపునిస్తున్న వామపక్ష పార్టీలు తాజాగా ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌)తో చేతులు కలపడానికి సిద్ధపడడం వివాదానికి దారి తీస్తోంది. 

30 శాతం ముస్లిం జనాభా ఉన్న బెంగాల్‌లో 100–110 సీట్లలో వారి ప్రభావం ఉంటుంది. ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి పరిషద్‌ అబ్బాస్‌ సిద్దికి నేతృత్వంలోని ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌)లను తమ కూటమిలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన మెగా ర్యాలీకి సిద్దికి హాజరై ప్రసంగించారు.

మేమే ప్రత్యామ్నాయం, మేమే లౌకికవాదులం, మేమే మీ భవిష్యత్‌ అన్న నినాదంతో బెంగాల్‌ బరిలోకి దిగిన వామపక్ష నాయకులు తమ వేదికపై ముస్లిం మత పెద్ద సిద్దికిని కూర్చోబెట్టడం పలు విమర్శలకు దారి తీస్తోంది. కరడుగట్టిన మతవాదితో కలుస్తూ లౌకిక రాగాలాపన ఎలా సాధ్యమంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు హోరెత్తిపోతున్నాయి. 

2016లో లెఫ్ట్, కాంగ్రెస్‌ కూటమికి 38% ఓట్లువచ్చాయి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు పోలయిన ఓట్ల కంటే ఇది కేవలం 7శాతం మాత్రమే తక్కువ. అందులో వామపక్ష పార్టీలే 26శాతం ఓటు బ్యాంకుని సాధించాయి. అయితే గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీల ఓటు బ్యాంకు ఏకంగా 7.52 శాతానికి తగ్గిపోయింది. 

వామపక్షాలు వేసే అడుగులు బీజేపీకి లబ్ధి చేకూరుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  పదేళ్లుగా మమతా దీదీ అణచివేత చర్యల్ని ఎదుర్కొంటూనే ప్రజా ఉద్యమాల ద్వారా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలైతే వామపక్ష పార్టీలు చేస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు కాంగ్రెస్‌తో మిత్రలాభం, మిత్రభేదాన్ని ఏకకాలంలోనే ఎదుర్కొంటూ వామపక్షాలు ఎలా ముందుకు సాగుతాయో చేచి చూడాల్సిందే. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle