newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోదీ టార్చర్ వలనే సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణించారు: ఉదయనిధి స్టాలిన్

02-04-202102-04-2021 13:16:09 IST
Updated On 02-04-2021 09:09:35 ISTUpdated On 02-04-20212021-04-02T07:46:09.188Z02-04-2021 2021-04-02T02:52:49.404Z - 2021-04-02T03:39:35.662Z - 02-04-2021

మోదీ టార్చర్ వలనే సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణించారు: ఉదయనిధి స్టాలిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డీఎంకే చీఫ్ ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ టార్చర్ కారణంగానే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలైన సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు మరణించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీపై విమర్శలు గుప్పిస్తూ పలువురు సీనియర్ నేతలను మోదీ పక్కన పెట్టారని విమర్శలు చేశారు. 

ఉదయనిధి వ్యాఖ్యలపై సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సురి స్వరాజ్ స్పందించారు. 'ఉదయనిధి జీ.. మీ ఎన్నికల క్యాంపెయిన్ కోసం మా అమ్మ పేరును వాడకండి.. మీరు చేసిన వ్యాఖ్యల్లో ఎంత మాత్రం నిజం లేదు. నరేంద్ర మోదీకి మా అమ్మ అంటే ఎంతో గౌరవం. మా కష్ట సమయాల్లో బీజేపీ అండగా ఉంది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధపెడుతూ ఉన్నాయి' అంటూ ట్వీట్ చేశారు. 

ఉదయనిధి స్టాలిన్ తన ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మోదీని చూసి భయపడడానికి తానేమీ ముఖ్యమంత్రి ఈపీఎస్‌ను కాదని, కరుణానిధి మనవడినని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అన్నాడీఎంకే నేతలు వచ్చి ఓట్లు అడిగితే జయలలిత ఎలా చనిపోయారని ప్రశ్నించాలని సూచించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పినట్టుగానే ఈ ఎన్నికల్లోనూ మోదీకి, పళనిస్వామికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్ర హక్కులన్నింటినీ ఢిల్లీకి తాకట్టుపెట్టేశారని, మరికొన్ని రోజులు ఆగితే రాష్ట్రాన్నే మోదీకి అమ్మేస్తారని అన్నారు. తాను తప్పుడు దారిలో వస్తున్నానని మోదీ అన్నారని, ఆయనను చూసి భయపడేందుకు తానేమీ పళనిస్వామిని కాదని, కలైంజ్ఞర్ మనవడినని గుర్తు చేశారు. రెండాకుల గుర్తుకు వేసే ఒక్కో ఓటు మోదీకి చేరుతుందన్నారు. అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె ఇడ్లీ, ఉప్మా తిన్నారని చెప్పారని, మరి ఆసుపత్రి బిల్లు రూ. 100 కోట్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అయినా, చివరికి అమ్మ చనిపోయారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామన్నారు. 

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   2 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle