కర్నాటకలోని మరాఠీ ప్రాంతాలు మావే.. ఉద్ధవ్ వ్యాఖ్యతో వివాదం
28-01-202128-01-2021 12:32:21 IST
2021-01-28T07:02:21.551Z28-01-2021 2021-01-28T07:02:09.990Z - - 07-03-2021

కర్నాటక సరిహద్దుల్లో మరాఠీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర వివాదానికి మళ్లీ తెరతీశారు. బుధవారం మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల మధ్య సరిహద్దు వివాదం చెలరేగిన వివాదంపై ఓ పుస్తకావిష్కరణ సభ కార్యక్రమంలో సీఎం ఉద్ధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఎలాగైనా గెలవాల్సిన అవసరం ఉందని సీఎం ఉద్ధవ్ నొక్కి వక్కాణించారు.
మహారాష్ట్ర పాలకకూటమి నేతలందరితో బుధవారం భేటీ అయిన సీఎం ఉద్ధవ్ థాకరే కర్నాటకతో సరిహద్దు వివాదం విషయంలో అన్ని పార్టీలూ ఐక్యమై దూకుడు పెంచాల్సిన అవసరం ఎంతైన అందని పేర్కొన్నారు. కర్నాటకలోని మరాటా మాట్లాడే ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలిపేసుకునే పోరులో రాజకీయాలు వద్దని ఉద్ధవ్ సూచించారు.
ప్రధానంగా సరిహద్దు సమస్యలు ఉన్న ఆయా రాష్ట్రాల భూభాగాలను న్యాయవ్యవస్థ పరిష్కరించేంత వరకు వివాదాస్పద ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని మహా సీఎం ఉద్ధవ్ థాకరే తేల్చి చెప్పారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు చివరి తీర్పు ఇచ్చే వరకూ కేంద్రం ఈ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని వ్యాఖ్యానించారు.
ఈ అత్యున్నత సమావేశానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం కర్నాటకలో భాగమై న్న బెల్గాం, కార్వార్, నిప్పాని వంటి కొన్ని ప్రాంతాలు తమవే నని మహారాష్ట్ర ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ ప్రాంతాల్లో చాలావరకు మరాఠీనే మాట్లాడుతుంటారు కాబట్టి ఈ ప్రాంతాలు మొత్తంగా తమకే చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోందిం దీంతో రెండు రాష్ట్రాలు సంవత్సరాలుగా ఈ వివాదంపై సుప్రీంకోర్టులో తలపడుతూ వస్తున్నాయి.
మరాఠా ఆత్మాభిమానంతో ముడిపెట్టి సమస్యలను లేవనెత్తడంలో పాలక శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే పేరుమోశారని తెలిసిందే. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉద్ధవ్.. బెల్గాను కర్నాటక రెండో రాజధానిగా చేయాలంటూ కర్నాటక చేసిన ప్రతిపాదనపై ధ్వజమెత్తారు. వ్యవహారం కోర్టులో ఉండగానే కర్నాటక ప్రభుత్వం బెల్గాం పేరును మార్చివేసి దాన్ని రెండో రాజధానిగా ప్రకటించేసింది. అక్కడే శాసనసభను కూడా నిర్మించి ఇప్పటికే ఒక సెషన్ సమావేశాన్ని కూడా అక్కడ ఏర్పర్చిందని ఉద్దవ్ పేర్కొన్నారు.
అందుకే కర్నాటకలో మరాటీ మాట్లాడే వారున్న ప్రాంతాలను సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పేంతవరకు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని ఉద్ధవ్ సంచనల ప్రకటన చేసారు.
ఒక్క అంగుళం భూమినీ పదులుకోం.. యడ్యూరప్ప
కర్నాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను ఎప్పటికైనా మహారాష్ట్రలో తిరిగి కలుపుకుంటామని కొన్ని రోజుల క్రితం సీఎం ఉద్ధవ్ ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే దీనికి కర్నాటక సీఎం యడియూరప్ప కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. ఉద్ధవ్ మాటలు సమాఖ్య వ్యవస్థకే విరుద్ధమని యడియూరప్ప పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో శరద్ పవార్ నిజంగా పెద్దన్నే

బలంగా ప్రతి పక్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్పదా
15 minutes ago

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
8 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
8 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
15 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
14 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
16 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
16 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
19 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
a day ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago
ఇంకా