newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ట్రంపు మ‌న సైడా కాదా..?

17-10-202017-10-2020 08:50:47 IST
2020-10-17T03:20:47.109Z17-10-2020 2020-10-17T03:20:35.982Z - - 25-10-2020

ట్రంపు మ‌న సైడా కాదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ ట్రంపు గోల‌ని త‌ట్టుకోవ‌డం కంటే.. పాకిస్థాన్ తో ఫైట్ కి దిగ‌డ‌మే బెట‌రేమో. అస‌లే తుంట‌రి ట్రంపు. మామూలు తెలివి తేటలు కావు.. సారువారికి సావు తెలివితేట‌లు ఉంట‌య‌నే సెటైర్లు అందుకే వినిపిస్తాయేమో. అయినా.. అమెరికా ప్రెసిడెంట్ అయ్యారంటే ఊరికే అవుతారా చెప్పండి. అద‌ట్టా వ‌దిలేస్తే.. ట్రంపు ఇండియా సైడా కాదా అనే డౌట్ ఎప్పుడూ వ‌స్తూనే ఉంటుంది. అవ‌స‌రం ఉంటే మాత్రం ఇండియా మేమూ దోస్తీ దోస్తీ అంటారు. లేదంటేనేమో.. భార‌త్ బ‌తుకు ఏమైద్దో చూపిస్తాం అంటూ వార్నింగ్ ఇస్తారు. ఇప్పుడు కూడా అంతే నోరు చించుకున్నారు.

పొల్యూష‌న్ విష‌యంలో మ‌న కంట్రీపై ప‌డ్డారు. చైనా, ర‌ష్యాల‌తో పాటు మ‌న‌ల్ని కూడా క‌లిపి నానా మాట‌లూ అనేశారు. ఈ మూడు దేశాల వ‌ల్ల‌నే ప్ర‌పంచం పొల్యూట్ అవుతోంద‌ని.. త‌మ అమెరికా ఒక్క‌టే సుద్ద‌పూస కంట్రీ అని క‌క్కేశారు. ఓజోన్ పొర‌కు ఈ మూడు దేశాల వ‌ల్లే డేంజ‌ర్ పొజిష‌న్ వ‌చ్చింద‌ని. అమెరికాపై ఉన్న ఓజోన్ కు ఎలాంటి రంధ్రాలు లేవంటూ కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల టైమ్ క‌దా. అన్ని దేశాల్నీ క‌లిపి తిడుతూ.. యూఎస్ జ‌నంలో దేశ‌భ‌క్తి నింపుతూ.. ఓట్లు కొట్టేయాల‌ని ప్లానేస్తుర‌ని పొలిటిక‌ల్ అన‌లిస్టులు అన‌లైజ్ చేస్తున్నారు. కానీ.. ట్రంపు మాత్రం గ‌ట్టిగానే వెళ్తున్నారు. ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్లాస్టిక్ బ‌దులుగా పేప‌ర్ వాడాల‌నే ప్ర‌చారాల్ని త‌ప్పుబ‌ట్టారు. 

ఇక అమెరికాలో లోక‌ల్ వాళ్ల‌కే జాబులు వ‌చ్చేలా.. బ‌య‌టి వాళ్ల‌కి త‌గ్గేలా చూస్తామ‌న్నారు. బ‌య‌టి వాళ్ల‌కంటే మ‌న వాళ్లే ఇంపార్టెంట్ అన్నారు. అలాగే అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను రెగ్యుల‌రైజ్ చేస్తామ‌నే అపొనెంట్ మాట‌ల‌ను కూడా త‌ప్పుబ‌ట్టారు. ముందు మ‌న‌వాళ్ల‌ని కాపాడుకోవాలి అన్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle