newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

17-04-202117-04-2021 18:28:55 IST
2021-04-17T12:58:55.806Z17-04-2021 2021-04-17T11:34:34.972Z - - 25-07-2021

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన సోనియా గాంధీ. " కోవిడ్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి ఏడాది కాలం అందుబాటులోకి వచ్చినా మళ్ళి  ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది " అని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడం అన్నది ఒక జాతీయ సవాలు అన్న వాస్తవాన్ని తమ పార్టీ మొదటి నుంచి విశ్వసిస్తూనే వస్తోందని, పార్టీ రాజకీయాలకు అతీతంగానే ఈ వైరస్ ను ఎదుర్కోవాలని ఆమె పిలుపు ఇచ్చారు.   

కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సంసిద్ధత లేకుండా ఎప్పటికప్పుడు అన్న చందంగానే చర్యలు చేపడుతోందని ఆమె అన్నారు. ఈ సందర్బంగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారు. టీకాలు వేయించుకునే వయసును 25 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రజలకు ఆదాయపరమైన మద్దతును అందించాలని ఆమె తెలిపారు. కోవిడ్ ను ఎదుర్కొనే విషయంలో కొన్ని రాష్రాలకే కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని అభ్యర్ధనలు చేసినా కఠినమైన మౌనాన్ని అనుసరిస్తోందని ఆమె అన్నారు. 

భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు

మొదటి దశ కంటే కూడా కోవిడ్ రెండవ దశ చాలా తీవ్రతతోనే దేశాన్ని తాకిందని, ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇప్పటికే తగిన చర్యలు చేపట్టి ఉండాల్సించని ఆమె అన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం విపక్షాల నిర్మాణాత్మక సూచనలను విస్మరించిందని, మంచి సలహాలు ఇచ్చే వారిపై కేంద్ర మంత్రులు విరుచుకుపడే పరిస్థితి తలెత్తిందని ఆమె అన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన అన్ని మందులు, వైద్య పరికరాలను జి ఎస్ టి నుంచి మినహాయించాలని ఆమె సూచించారు. తాజా ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అర్హుడైన ప్రతి పౌరుడి ఖాతాలోకి ఆరు వేల రూపాయలు బదలాయించాలని సోనియా గాంధీ సూచించారు. 

ఢిల్లీలో లాక్ డౌన్ త‌ప్ప‌దు..

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   3 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   10 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   10 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   11 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle