newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్టాలిన్ చెప్పు విలువ కూడా చేయరు.. గాలితో కూడా కుంభకోణాలు.. తమిళనాడులో మాటల యుద్ధం

27-03-202127-03-2021 18:23:39 IST
2021-03-27T12:53:39.197Z27-03-2021 2021-03-27T12:53:33.213Z - - 16-04-2021

స్టాలిన్ చెప్పు విలువ కూడా చేయరు.. గాలితో కూడా కుంభకోణాలు.. తమిళనాడులో మాటల యుద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మరి రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో రాజకీయ ప్రచారం కంటే ప్రత్యర్థులపై నిందారోపణలు చేయడం మరీ మోతాదు మించుతున్నట్లు కనిపిస్తోంది. డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజా వంటి వ్యక్తి సైతం ఈ మకిలిలో కాలు పెట్టడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కాలి చెప్పు పాటి విలువ కూడా చేయరంటూ రాజా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపాయి. కాని ఒకనాటి తన పేదరిరంపై డీఎంకే నేత చేసిన ఆరోపణను సీఎం తిప్పికొట్టారు. తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానంటూ పళనిస్వామి చేసిన ప్రకటన అనేకమందిని కదిలించివేసింది.

ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. ఒకప్పుడు బెల్లం మార్కెట్‌‌లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీనా అంటూ రాజా ఈసడించుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకే విలువ ఎక్కువ.. అలాంటిది ఆయనకు స్టాలిన్‌నే సవాల్ చేసే ధైర్యం ఉందా. నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తి స్టాలిన్‌ను అడ్డుకుంటాను అంటున్నాడు. అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నాను అని రాజా వ్యాఖ్యానించారు.

నేను వెండిగిన్నెతో పుట్టలేదు.. పేదలం ఇలాగే ఉంటాం.. పళనిస్వామి సమాధానం

అయితే డీఎంకే నేత చేసిన దూకుడు వ్యాఖ్యలను సీఎం పళనిస్వామి తనకు అనుకూలంగా మార్చుకున్నారు.  తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగానే ఉంటానంటూ ప్రజల్లో తన మీద సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేశారు.

మదురై జిల్లా మెలూర్‌లోని ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి  మాట్లాడుతూ.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు. కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్‌తో పుట్టారు. రాజా మాట్లాడిన భాష ఎలా ఉందో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని..  పొగరుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోల్చి వారు ఎంతటి సంస్కారహీనులో నిరూపించుకున్నారు అంటూ పళనిస్వామి మండిపడ్డారు.

నిజమే.. నేను  నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం... కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకున్నది కొనుక్కుంటారు అంటూ పళనిస్వామి రాజాకు 2జి స్పెక్ట్రమ్‌లో డీఎంకే పాత్రపై కౌంటర్ ఇచ్చారు.

స్టాలిన్‌ సమర్థుడు కాదనే విషయం కరుణానిధికి కూడా తెలుసని, అందుకే ఆయన చేతికి అధికారం ఇవ్వకుండా చివరి క్షణం వరకు తన వద్దే ఉంచుకున్నారన్నారు. స్టాలిన్‌ను తండ్రే నమ్మనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని పళనిస్వామి  ప్రశ్నించారు. తండ్రి వారసత్వంతో స్టాలిన్‌లా రాజకీయాల్లోకి రాలేదని, ఒక్కో మెట్టు ఎక్కి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. 

డీఎంకే విజయదుందుభి తప్పదా.. స్టాలిన్‌కే పట్టం అంటున్న సర్వేలు

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle