newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తమిళనాడులో బీజేపీని పక్కన బెట్టేసిన అన్నాడీఎంకే

03-04-202103-04-2021 09:32:21 IST
2021-04-03T04:02:21.289Z02-04-2021 2021-04-02T12:48:37.438Z - - 16-04-2021

తమిళనాడులో బీజేపీని పక్కన బెట్టేసిన అన్నాడీఎంకే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని కూటమిలో చేర్చుకున్నప్పటికీ ఆ పార్టీని ప్రచార సమయంలో ఆమడ దూరంలో పెడుతున్న అధికార అన్నాడీఎంకే పార్టీ కూటమి ధర్మాన్ని కూడా పక్కన బెట్టడానికి బలమైన కారణమే ఉంది మరి. దక్షిణ, మధ్య తమిళనాడు జిల్లాల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్న సూచనలు ఇప్పటికైతే కనిపించలేదు కానీ, బీజీపీ  జాతీయ నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు పూర్తిగా దాసోహమైపోయారనే ఆరోపణే పళనిస్వామికి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెడుతోంది. ఎన్నికల్లో గెలుపును కూడా ఇది ప్రభావింతం చేస్తుందని పరిశీలకుల అంచనా.

అన్నాడీఎంకే కూటమిలో భాగమైన బీజేపీకీ ఈ ఎన్నికల్లో 20 స్థానాలను ఇచ్చారు. 2016 ఎన్నికల్లో బీజేపీ 188 స్థానాల్లో పోటీచేసి 2.84 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. కాగా పోటీ చేసిన 180 స్థానాల్లో డిపాజట్లు కోల్పోయింది కూడా.

అందుకే అన్నాడీఎంకేను ఇప్పుడు బీజేపీ భూతంలా వణికిస్తోంది. జయలలిత విషాద మరణం తర్వాత అన్నాడీఎంకేలో చీలిక రాకుండా చేసిన ఎడప్పాడి పళనిస్వామి సమర్థత పట్ల సర్వత్రా ప్రశంసలు లభించాయి కానీ ఆయన ప్రభుత్వ విజయాల పట్ల జనంలో పెద్దగా స్పందన రావడం లేదు. జయలలిత ప్రజాకర్షణ, ఎం కరుణానిధి వాగ్దాటి రెండూ లేని పళనిస్వామి రాష్ట్రంలో బీజేపీకున్న విలువ ఏపాటిదో అర్థమై తన పార్టీ ప్రచార సభల్లోకి కనీసం బీజేపీ నాయకులనైనా ఆహ్వానించలేదు.

ప్రధానంగా దశాబ్దాలుగా తమిళనాడులో ద్రావిడవాదం బలీయంగా కొనసాగుతోంది. కానీ కరుణానిధి, జయలలితలు లేకుండా తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ జాతీయ వాదం తన హవా మునుపటిలా కొనసాగిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమే కానీ అలా చెప్పి బీజేపీని దగ్గరకు తీసుకునే ఏ పార్టీకైనా తమిళ రాజకీయాల్లో స్థానం ఉండదని చరిత్ర చెప్పింది.

ఈ నేపథ్యంలోనే ద్రవిడ జాతీయవాదం గెలుస్తుందా ఓడుతుందా అనే వాదనను పక్కనబెట్టి అన్నాడీఎంకే నేతలు, అభ్యర్థులు వాస్తవిక దృష్టితోనే బీజేపీని అలా పక్కనబెట్టేశారు. చివరకు పరిస్థితి ఎలా తయారయిందంటే చెన్నయ్ హార్బర్ నియోజకవర్గం, రోయాపురం, జోలార్ పేట, దిండిగల్ వంటి చోట్ల బీజేపీ నేతల ప్రమేయం లేకుండానే అన్నాడీఎంకే అభ్యర్థులు గుట్టు చప్పుడు కాకుండా ప్రచారంలో మునిగిపోయారు. ఈ స్థానాలన్నింట్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉండటంతో బీజేపీ నేతలను అధికారపార్టీ దగ్గరకు రానివ్వడం లేదు. పైగా బీజేపీ, వీహెచ్‌పీ పోటీ చేస్తున్న స్థానాల్లో పొరపాటున కూడా ప్రచారానికి వెళ్లకుండా, కూటమి ధర్మం పాటించకుండా అన్నాడీఎంకే జాగ్రత్తగా పావులు కదువుతోంది. 

మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. బీజేపీ అభ్యర్థులు సైతం అన్నాడీఎంకే కండువాలతో పోటీచేయడమే. అనేక నియోజకవర్గాల్లో వారు తమ జాతీయ నేతలైన నరేంద్ర మోదీ, అమిత్‌ షాల ఫోటోలు పట్టుకుని తిరగడం లేదు. జయలలిత ఫోటోనే నమ్ముకుని, అన్నాడీఎంకే జెండాలనే చేబూని వెళుతుండడం కనిపించింది. మరీ ముఖ్యంగా కుష్బూ, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై, నయనార్ నాగేంద్రన్, పి. శరవరణన్, పాండురంగన్, మురుగన్ వంటి బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ జయలలిత ఆశీస్సులున్న అభ్యర్థులం అని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు తప్పితే పొరపాటున కూడా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల పేర్లనైనా ప్రస్తావించడం లేదు.

పైగా అనేక నియోజవర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్ధులు మమ్మల్ని ప్రచారంలోకి రానివ్వడం లేదు. ఒకవేళ గట్టిగా పట్టుబడితే, వస్తే రండి గానీ, కాషాయ కండువాలు, బీజేపీ జెండాలు చేబూనకుండా వచ్చి పాల్గొనండి అని చెబుతున్నారు అని ఓ బీజేపీ నాయకుడు వాపోవడం పరిస్థితిని వివరిస్తోంది. బీజేపీతో చెలిమి వల్ల అన్నాడీఎంకే కూడా ఆర్యుల పార్టీ, హిందీ రాష్ట్రాల వారి పార్టీ అన్న విమర్శ వచ్చింది. దీనిని తట్టుకునేందుకు, బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నా.. ఉమ్మడి ప్రచారానికి అన్నాడీఎంకే శ్రేణులు విముఖత వ్యక్తం చేయడం విశేషం. మోదీ-షాల ఎన్నికల మేనేజ్‌మెంట్‌ ఏ మాత్రం పనిచేయని తమిళనాట వాదం, కులం ప్రధాన అంశాలయ్యాయని అంటున్నారు.  

రాజకీయాలపై కమల్ కామెంట్స్.. ఆయన్ను టార్గెట్ చేసిన నటి గౌతమి

మొత్తం మీద చూస్తే దేశం మొత్తం మీద నరేంద్రమోదీ, అమిత్ షాల ఊసే లేకుండా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం ఏదన్నా ఉందా అంటే అది తమిళనాడు మాత్రమే, ఎన్నికలకు ముందు కూడా ద్రవిడ జాతీయ వాదం ఇక్కడే తన ఉనికిని ప్రదర్సిస్తోంది మరి. 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   4 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle