newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

రసకందాయంలో తమిళరాజకీయాలు- అన్నాడీఎంకేలో వర్గపోరు, డీఎంకే ఒంటరి పోరు

05-10-202005-10-2020 16:57:57 IST
2020-10-05T11:27:57.240Z05-10-2020 2020-10-05T11:27:52.354Z - - 21-10-2020

రసకందాయంలో తమిళరాజకీయాలు- అన్నాడీఎంకేలో వర్గపోరు, డీఎంకే ఒంటరి పోరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళనాడు రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ త్వరలో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో అధికార అన్నాడీఎంకేలోనే కాకుండా దాని మిత్రపక్షాలలో కూడా ప్రకంపనలు బయలు దేరాయి. శశికళ జైలు నుంచి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికార అన్నాడీఎంకేలో వలసలకు తేరలేస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో మిత్రపక్షాలు కూడా తమతమ ప్రయత్నాలలో పడ్డాయి.

అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్నాడీఎంకేలో నిట్టనిలువుగా చీలిక ఏర్పడే సూచనలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలను అలా ఉంచితే... ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య విభేదాల అగాధం ఏర్పడిందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

దీంతో అన్నాడీఎంకేకు విశ్వసనీయ మిత్రపక్షమైన పట్టాలిమక్కల్ కట్చి డీఎంకే గూటికి చేరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పీఎంకే నేత  రాందాస్ అన్బుమణి డీఎంకే అధినేత స్టాలిన్ తో సమావేశమయ్యారు. వారిరువురి మధ్య  చర్యల సారాంశం ఏమిటన్నది స్పష్టంగా తెలియనప్పటికీ...వచ్చే ఎన్నికలలో అన్నాడీఎంకేతో కాకుండా డీఎంకేతో కలిసి పోటీ చేయాలన్న నిర్ణయానికి పీఎంకే వచ్చేసిందనే చెబుతున్నారు.  ఇలా ఉండగా ఇప్పటికే రెండు పర్యాయాలు వరుసగా విపక్ష పాత్రకే పరిమితమైన డీఎంకే రానున్న ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.

అయితే గత ఎన్నికలలో పార్టీ ఓటమికి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు అత్యధిక అసెంబ్లీ స్థానాలు కేటాయించడమే కారణంగా నిర్ధారణకు వచ్చిన డీఎంకే ఈ సారి ఆ పార్టీకి రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న బలం మేరకే సీట్లు కేటాయించాలని, లేకుండా ఆ పార్టీతో అంటే యూపీఏతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగానైనా బరిలోకి దిగాలని యోచిస్తున్నది.

అదే సమయంలో ఇటీవలి కాలంలో రాష్ట్రంలో తమ పార్టీ పలుకుబడి( ఇమేజ్) గణనీయంగా పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్ అధిక స్థానాలలో పోటీకే మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులు రానున్న ఎన్నికలలో ఎప్పటిలా ద్విముఖ పోటీ కాకుండా ఈ సారి బహుముఖ పోటీ జరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద తమిళరాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ కూటముల్లో మార్పులు భారీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

   24 minutes ago


ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

   an hour ago


ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   12 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   13 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   16 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   16 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   17 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   17 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   18 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle