మూడు పార్టీలు.. ఓ స్టారు.. అదీ తమిళ రాజకీయం
21-02-202121-02-2021 14:00:49 IST
2021-02-21T08:30:49.628Z21-02-2021 2021-02-21T02:46:10.123Z - - 09-03-2021

రాజకీయం మాటి మాటికీ రంగులు మార్చడం చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు తమిళ్ లో అదే పొజిషన్ లో ఉంది. అక్కడ మార్చే రంగులు అన్నీ ఇన్నీకావు. సూపర్ స్టార్ రజనీకాంత్.. రాజకీయాల్లోకి వస్తే వేరేలా ఉండేది. కానీ.. నేను రాను అని రజనీకాంత్ తేల్చి చెప్పడంతో.. మరోలా మారిపోయింది రాజకీయ ముఖ చిత్రం. ఇప్పుడు ఎవరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నారు అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు.
ఎన్నికల టైంకి.. శిశకళ రిలీజ్ కావడం కూడా.. సినిమా ట్విస్ట్ లాగే ఉంది. కరెక్ట్ గా ఎన్నికల హీట్ పెరిగే టైంలో జైలు నుంచి బయటికి వచ్చిన శశికళ.. హీట్ మరికాస్త పెంచేశారు. ఇప్పుడు తమిళ రాజకీయ ముఖ చిత్రం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్దం కావడం లేదు. ఓ వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ ని.. తమిళ్ స్టార్ హీరో, రాజకీయ పార్టీ అధినేత అయిన కమల్ మీట్ అయ్యారు. ఓ అరగంట, గంట దాకా చర్చించారు. కానీ.. ఇది పొలిటికల్ మీట్ కాదు.. పక్కా ఫ్రెండ్లీ మీటింగ్ అంటున్నారు. అయినా.. జనం నమ్ముతారా చెప్పండి. రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా.. రజనీకాంత్ ని ప్రత్యేకంగా కలిస్తే.. పొలిటికల్ మీటింగే అనుకుంటారు. ఇకపోతే.. ఆల్రెడీ.. రజనీకాంత్ మద్దతు కోరతా అని కమల్ ప్రకటించారు కదా. ఇప్పుడు ఆ మాటలకి వ్యాల్యూ మరికాస్త పెరిగింది.
ఇక పోతే.. అన్నాడీఎంకే నాదీ అంటోన్న శశికళ కూడా రాజకీయ తంత్రాల్లో బిజీగా ఉన్నారు. అప్పుడంటే.. సీఎం సీటు దాకా వెళ్లి.. కూర్చునేలోగా.. జైలు పాలయ్యారు. ఈసారి ఆ ఛాన్సులు లేకుండా.. సీఎం సీటు ఎక్కి కూర్చోవాల్సిందే అని ఫిక్స్ అయ్యారు శశికళ. అందుకే.. అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకుంటోన్న బీజేపీకి రాయబారం పంపారట శశికళ. అన్నాడీఎంకే బీజేపీ కలిస్తే.. మళ్లీ గెలుస్తారు అనే గ్యారంటీ లేదు. స్టాలిన్ పార్టీనే విజయం సాధిస్తుంది అనే క్లారిటీ ఉంది. కానీ.. శశికళకు బీజేపీ సపోర్ట్ చేస్తే ఎలా ఉండబోతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు. అలా ఊహించలేని టర్న్ తీసుకున్నారు శశికళ. బీజేపీ సీనియర్ లీడర్.. మినిస్టర్ అమిత్ షాకి.. శశికళ రాయబారం పంపినట్లు తెలుస్తోంది. మరి.. ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. ఆల్రెడీ.. అమిత్ షా కూడా రజనీకాంత్ ని మద్దతు కోరదాం అని చూస్తున్నారు కదా. శశికళ, బీజేపీ, రజనీకాంత్ కలిస్తే.. ఏం జరగబోతుంది అనేది చూడాలి. మరి కమల్ ఫ్రెండ్షిప్ కి రజనీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అనేది.. మరో ఇంట్రస్టింగ్ పాయింట్.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా