newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్థానిక సమస్యలు తీర్చండి.. కోవిడ్ పై మంత్రులతో మోడీ సమీక్ష

30-04-202130-04-2021 19:15:29 IST
Updated On 01-05-2021 07:28:03 ISTUpdated On 01-05-20212021-04-30T13:45:29.515Z30-04-2021 2021-04-30T13:45:25.594Z - 2021-05-01T01:58:03.464Z - 01-05-2021

స్థానిక సమస్యలు తీర్చండి.. కోవిడ్ పై మంత్రులతో మోడీ సమీక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల కారణంగా తలెత్తుతున్న పరిస్థితులు, పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ వివిధ మంత్రిత్వ శాఖలతో కీలక సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించాలని, వారి నుంచి అందుతున్న సమాచారాన్ని తీసుకుని తదనుగుణమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. కోవిడ్ రెండవదశ వైరస్ దేశవ్యాప్తంగా అత్యంత భయానకమైన పరిస్థితులకు దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, రోగులకు చికిత్సను అందించేందుకు, మరణాల రేటును తగ్గించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే మోడీ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. దేశంలో కోవిడ్ పరిస్థితిని ఎదురుకునేందుకు తీసుకుంటున్న చర్యలను నీతి  ఆయోగ్ (ఆరోగ్య) సభ్యుడు వి.కె. పాల్ ఈ సందర్బంగా మోడీకి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మోడీ స్థానిక స్థాయిలో తలెత్తుతున్న అంశాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని మంత్రులను ఆదేశించారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒక శతాబ్ద కాలంలో వచ్చే మహా విపత్తుగా మంత్రిమండలి అభివర్ణించింది.  ఈ మహావిపత్తు వల్ల  మొత్తం ప్రపంచానికే ఓ పెను సవాలు ఎదురవుతోందని మంత్రిమండలి అభిప్రాయపడింది.

కోవిడ్ రెండవ దశ భారత దేశంలో మరణ మృదంగాన్నే మోగించింది. రోజువారీగా లక్షల సంఖ్యలో పెరిగిపోవడంతో పాటు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్ కొరత ఆసుపత్రులన్నీ రోగులతో నిండి పోవడంతో కొత్తగా వైరస్ సోకిన వారికి చికిత్సను అందించలేని పరిస్థితి తలెత్తింది. అమెరికా సహా అనేక దేశాల నుంచి ఆక్సిజన్ ఉత్పాదక పరికరాలు, రోగనిర్ధారణ పరికరాలు భారత్ కు దిగుమతి అవుతున్నాయి. కోవిడ్ వైరస్ ను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్నాయని, సవాళ్ళను గుర్తించి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఈ సందర్బంగా సమాచార శాఖ మోడీకి నివేదించింది.

అలాగే గత 14 నెలల కాలంలో కోవిడ్ వైరస్ ను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలను కూడా ఈ సందర్బంగా సమీక్షించారు. కోవిడ్ మొదటి దశకంటే కూడా రెండవ దశ భారతదేశంపై పగబట్టిన చందంగా సాగుతోంది. ఇటు కేసులు, అటు మరణాలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులనే సృష్టించడంతో జనంలో భయం పెరిగిపోయింది. ఇంత భారీ స్థాయిలో కేసులు పెరగడానికి మౌలిక కారణాలపై దృష్టిపెట్టిన కేంద్ర క్యాబినెట్ స్థానికంగానే దీనికి చెక్ పెట్టాలని, ఆ విధంగా పరిస్థితిని అదుపు చేయాలని సంకల్పించింది. మోడీ ఆదేశాలు నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి స్థానికంగా తలెత్తే సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తోంది. 

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   3 minutes ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   35 minutes ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   19 hours ago


కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

   13-05-2021


కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

   13-05-2021


రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

   13-05-2021


నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

   a day ago


విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

   12-05-2021


అంతా కేంద్ర పెత్తనం వల్లే !  ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle