newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

దేశంలో 12 నగరాలకు బయల్దేరిన కోవిషీల్డ్‌ టీకా.. చారిత్రాత్మక క్షణం

12-01-202112-01-2021 13:17:39 IST
2021-01-12T07:47:39.274Z12-01-2021 2021-01-12T07:40:23.020Z - - 20-01-2021

దేశంలో 12 నగరాలకు బయల్దేరిన కోవిషీల్డ్‌ టీకా.. చారిత్రాత్మక క్షణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంగళవారం భారత్ ఒక చారిత్రాత్మక క్షణానికి నాంది పలికింది. మంగళవారం తెల్లవారు జామున దేశ చరిత్రలో ఒక కీలక పరిణామం సంభవించింది. అతితక్కువ కాలంలో కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ మంగళవారం తొలి విడత టీకా సరఫరా ప్రారంభించంది.

పుణెలోని తయారీ కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ డోసుల్ని మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పంపించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిని పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉదయం 10 గంటలకల్లా సరఫరా చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు కూడా మధ్యాహ్నం 12 లోపు తొలి కార్గొ విమానం కరోనా టీకాలతో చేరుకోనుంది.

తొలి విడత డోసులు పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు చేరనున్నట్లు సమాచారం. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

తొలి కార్గో విమానం హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్‌కు రానుండగా.. మరొకటి కోల్‌కతా, గువాహటికి వెళ్లనున్నట్లు కరోనా పంపిణీతో సంబంధమున్న ఓ అధికారి తెలిపారు. ముంబయికి రోడ్డుమార్గం ద్వారా వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేయనున్నట్లు సమాచారం. స్పైస్‌జెట్‌కు చెందిన విమానాల్ని టీకా రవాణా కోసం వినియోగిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు.

కోవిషీల్డ్ రవాణా కోసం జీపీఎస్‌ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించారు. మొత్తం 478 బాక్సుల్లో టీకాలను భద్రంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు బరువు దాదాపు 32 కిలోలు ఉంటుందని సమాచారం.

ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందుకు శరవేగంగా ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. ఇందులో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత.. 50 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్య సమస్యలున్న 50 ఏళ్లలోపు వారికి టీకా‌ వేస్తారు.

దేశంలో తొలివిడతలో మూడు కోట్ల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు భారత్‌ బయోటెక్‌ కూడా తన టీకాలను నేరుగా 12 రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. ఈ ప్రక్రియ మంగళవారం ప్రారంభమై, రెండు రోజుల్లో ముగియనుందని సంబంధిత అధికారులు తెలిపారు.

కేంద్రప్రభుత్వం ఇప్పటికే 1.01 కోట్ల కోవిషీల్డ్ డోసులను కొనుగోలు చేసింది. ఏప్రిల్ నెలనాటికి ఒక్కొక్కటి రూ. 200ల చొప్పున 5.60 కోట్ల డోసులను కొనడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మరో ఆరునెలల్లోపు 30 కోట్లమంది ప్రజలకు కరోనా టీకాలు ఇవ్వాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. ఇది ప్రపంచంలో కెల్లా అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం కావడం విశేషం.

 

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   4 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   5 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   6 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   9 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   9 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   9 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   11 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   13 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   15 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle