newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

మోడీపై సోష‌ల్ మీడియా ఎఫెక్ట్.. మూడిన‌ట్లేనా

19-02-202119-02-2021 14:20:17 IST
Updated On 19-02-2021 10:14:40 ISTUpdated On 19-02-20212021-02-19T08:50:17.704Z19-02-2021 2021-02-19T02:07:15.466Z - 2021-02-19T04:44:40.717Z - 19-02-2021

మోడీపై సోష‌ల్ మీడియా ఎఫెక్ట్.. మూడిన‌ట్లేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అప్పుడప్పుడే సోష‌ల్ మీడియా హైలైట్ అవుతున్న స‌మ‌యం అది. గ్రామాల్లోకి కూడా మెల్లిమెల్లిగా పాకుతున్న టైం. ఆ టైంలో.. హైలైట్ అయ్యారు మోడీ. ముఖ్య‌మంత్రి నుంచి ప్ర‌ధాన‌మంత్రిగా మార‌డానికి.. పీఎం అయ్యి.. దేశాన్ని ఉద్ధ‌రిస్తారు అని జ‌నం న‌మ్మ‌డానికి సోష‌ల్ మీడియా.. మోడీకి ఎంతో హెల్ప్ అయింది. యాక్చువ‌ల్ గా సోష‌ల్ మీడియానే బీజేపీని గెలిపించింది అనొచ్చు కూడా. ఎందుకంటే.. నరేంద్ర మోడీ అప్ప‌ట్లో అంత ఫేమ‌స్ అయ్యారు. చ‌దువుకున్న ప్ర‌తి వారూ.. కాంగ్రెస్ ప‌థ‌కాల‌తో పాల‌న‌తో విసిగిపోయిన వారూ.. మోడీని లైక్ చేశారు. గుజ‌రాత్ సీఎంగా మంచి పేరుతెచ్చుకున్న మోడీపై ఎంతో మంది ఆశ‌లు పెంచుకున్నారు. ఈయ‌న గానీ... దేశ ప్ర‌ధాని అయితే..  గుజ‌రాత్ ని పాలించిన‌ట్లే పాలిస్తారు అంటూ.. సోష‌ల్ మీడియా ఎంతో హెల్ప్ చేసింది. అవి ఫేక్ ప‌బ్లిసిటీనా.. ఇంకోటింకోటా అనేది వ‌దిలేస్తే బాగా హెల్ప్ అయింది అనే మాట మాత్రం నిజం.

కొత్త‌లో కొన్నాళ్ల ఆయ‌న మాట‌లు కోట‌లు దాటుతుంటే జ‌నాలు ఎంజాయ్ చేశారు. ఇక ముందుంది దేశానికి పండ‌గ రోజులే అనుకున్నారు. అస‌లు ప్ర‌తి రోజూ పండ‌గే అని కూడా అనుకున్నారు. కానీ.. త‌ర్వాత త‌ర్వాత అంతా మారిపోయింది. కానీ.. రెండోసారి గెలిచేదాకా.. ఆ ఎఫెక్ట్ అలాగే ఉంది. ఇంకోసారి చూశారు. కానీ.. మార్పులేదు. పెద్ద‌గా ఒరుగుతుంది ఏమీ లేదు అనే ఫీలింగ్ కి వ‌చ్చేశారు జ‌నాలు. ఇప్పుడిప్పుడే సోష‌ల్ మీడియా మోడీకి అడ్డం తిరుగుతోంది. జ‌నం కూడా ఇంట‌లెక్చువ‌ల్స్ అయిపోయారు. ఫేక్ ప‌బ్లిసిటీని ఏ మాత్రం న‌మ్మ‌డం లేదు. మొత్తం లెక్క‌ల‌తో ప‌క్కాగా ఉన్నారు.

మోడీని హీరోని చేసిన సోష‌ల్ మీడియానే ఇప్పుడు జీరోని చేస్తుంది. అప్ప‌ట్లో నోట్ల ర‌ద్దు పెద్ద ఇష్యూ అయింది. అలాగే.. జీఎస్టీ కూడా ఇష్యూ అయింది. అప్ప‌ట్లో కూడా సోష‌ల్ మీడియాలో ఫుల్ నెగ‌టివిటీ వ‌చ్చింది. కానీ.. అవి అంత‌టితో ఆగిపోతే.. ఇంత నెగ‌టివిటీ వ‌చ్చేది కాదు. కానీ.. ఇప్ప‌టికీ ఏదో ఒక‌టి జ‌రుగుతూనే ఉంది. ఓ ప‌క్క రైతు ఉద్య‌మంతో పంజాబ్ లో భారీగానే దెబ్బ ప‌డింది. జ‌నంలో చేంజ్ వ‌చ్చింది అనే విష‌యంలో క్లారిటీ వ‌చ్చింది.

ఇప్పుడు గ్యాస్ రేట్లు.. పెట్రోల్ రేట్లు మంట‌లు మండిస్తున్నాయి. ఇవి కూడా సోష‌ల్ మీడియాలో మ‌రి కాస్త నెగ‌టివిటీని మూట‌గ‌ట్టుకుంటున్నాయి. చూస్తుంటే.. మోడీకి బ్యాడ్ టైం వ‌చ్చిన‌ట్లే ఉంది. సోష‌ల్ మీడియాలో మోడీ స‌పోర్ట‌ర్లు ఎంత బ‌లంగా నుంచున్నా.. నెగ‌టివ్ గా ఉన్న వాళ్ల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది. ఈ రోజుల్లో సోష‌ల్ మీడియాని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేం. అస‌లే.. సోష‌ల్ మీడియాపై కూడా క‌త్తి దూస్తోంది మోడీ స‌ర్కార్.. త‌న చాప‌కిందికే నీరొస్తే ఊరుకుంటుందా చెప్పండి. 

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

   6 hours ago


కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

   8 hours ago


కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

   9 hours ago


వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

   9 hours ago


ఇదేం  అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

ఇదేం అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

   10 hours ago


రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి

   10 hours ago


హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత

   10 hours ago


ప‌వ‌న్ కి విశాఖ‌లో అడుగు పెట్టే ధైర్యం లేదా

ప‌వ‌న్ కి విశాఖ‌లో అడుగు పెట్టే ధైర్యం లేదా

   an hour ago


ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న

   8 hours ago


డాక్ట‌ర్ చిరంజీవి కొల్లూరి క‌న్నుమూత..!

డాక్ట‌ర్ చిరంజీవి కొల్లూరి క‌న్నుమూత..!

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle