newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

బీహార్‌ అసెంబ్లీ బరిలో శివసేన- విస్తరణ కోసమా, ప్రతీకారం కోసమా?

06-10-202006-10-2020 18:23:21 IST
Updated On 06-10-2020 18:35:20 ISTUpdated On 06-10-20202020-10-06T12:53:21.745Z06-10-2020 2020-10-06T12:53:10.888Z - 2020-10-06T13:05:20.377Z - 06-10-2020

బీహార్‌ అసెంబ్లీ బరిలో శివసేన- విస్తరణ కోసమా, ప్రతీకారం కోసమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో శివసేన పోటీకి సిద్ధపడుతోంది. కనీసం 50 అసెంబ్లీ నియోజవకర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలపాలని భావిస్తున్నట్లు పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. అయితే తక్కువలో తక్కువ 30 నుంచి 40 స్థానాలలో మాత్రం కచ్చితంగా పోటీలో ఉంటామని ఆయన చెబుతున్నారు. పార్టీ విస్తరణ వ్యూహాలలో భాగంగా బీహార్ లో పోటీకి శివసేన సిద్ధపడుతున్నదని భావించాలా? లేక ఎన్డీయే కూటమి విజయావకాశాలను దెబ్బతీయాన్న లక్ష్యంతో రాష్ట్రంలో అభ్యర్థులను నిలపనుందా అన్న విషయంలో స్పష్టత ఆ పార్టీలోనే ఉన్నట్లు కనిపించడం లేదు.

పోటీకి రాజకీయ కారణాలను చెప్పడంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తడబడ్డారు. ‘ధోనీ ద అన్ టోల్డ్ స్టోరీ‘ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత జరిగిన పరిణామాలు మహారాష్ట్రలో శివసేనకు ఒకింత ఇబ్బందికర పరిస్థితులను సృష్టించాయనే చెప్పాలి. బీహార్ కు చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెపోటిజం మాత్రమే కాదు, డ్రగ్స్ చీకటి కోణం...రాజకీయ సంబంధాలు, ప్రాంతీయతత్వం అన్నీ వెలుగులోనికి వచ్చాయి. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రనౌత్ ఏకంగా శివసేన అధినేత, ఆయన కుమారుడు లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఆమె కార్యాలయ భవనంలోని కొంత భాగాన్ని బృహన్ ముంబై అక్రమ కట్టడమంటూ కూల్చివేయడం కూడా శివసేనకే మచ్చ తెచ్చే విధంగా తయారైంది.

శివసైనికులు కరోనాను కాదు కంగనాను తరిమి కొట్టాలన్న నినాదాలతో సుశాంత శింగ్ ఆత్మహత్య ఉదంతం రాజకీయ మలుపు తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో బీజేపీ కంగనా రనౌత్ కు కేంద్ర బలగాలతో భారీ భద్రత కల్పించడం రాష్ట్రంలో ఆమెకు భద్రత లేదని కేంద్రం కూడా భావిస్తున్నదన్న సంకేతాన్ని ఇచ్చింది. అదిగో సరిగ్గా అప్పుడూ బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. శివసేన తొలి నుంచీ కూడా ఆధిపత్యమే తప్ప భాగస్వామ్యం అంగీకరించని వైఖరిని ప్రదర్శిస్తుంటుంది. సరిగ్గా ఆ వైఖరే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ నిర్ణయానికి ఆ పార్టీ రావడానికి కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అదీ కాక బీహార్ మాజీ డీజీపీ...గుప్తేశ్వర్ పాండే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపడానికి ప్రధానంగా ఆయనే కారణమన్నది శివసేన అభిప్రాయం. ఇఫ్పుడు ఆయన జేడీయూ అభ్యర్థిగా బీహార్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.  దీంతో ఆయన టార్గెట్ గా కూడా శివసేన బీహార్ ఎన్నికల బరిలో దిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

   39 minutes ago


ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

   an hour ago


ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   12 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   13 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   16 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   16 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   17 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   17 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   18 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   18 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle