newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

27-09-202027-09-2020 13:23:37 IST
Updated On 27-09-2020 13:26:53 ISTUpdated On 27-09-20202020-09-27T07:53:37.423Z27-09-2020 2020-09-27T07:53:34.149Z - 2020-09-27T07:56:53.026Z - 27-09-2020

ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చండీగఢ్‌ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌(ఎన్డీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) ప్రకటించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ అత్యవసర సమావేశం అనంతరం పార్టీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించడంతోపాటుగా, జమ్మూకశ్మీర్‌లో పంజాబీని రెండో అధికారి భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఎన్‌డీఏ నుంచి బయటకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. 

దేశంలోని రైతులు, కూలీలు, స్థానిక వ్యాపారులకు వ్యతిరేకంగా మూడు వ్యయసాయ బిల్లులను కేంద్రం ఇటీవలే ప్రవేశపెట్టిందని, కానీ వాటిని రూపొందించేటప్పుడు కనీసం మా అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం కేంద్రప్రభుత్వం చేయలేదని శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. 

గత రెండు నెలలుగా రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోవడానికి, కొత్త వ్యవసాయ బిల్లులు రైతులపై వేసే ప్రభావం గురించి చెప్పడానికి మేం ప్రయత్నించాం కానీ కేంద్రం మా మాట పెడచెవిన పెట్టింది. పంజాబ్‍లో అకాలీదళ్‌కు రైతులే బలమైన ఓటు పునాదిగా ఉన్నారని, వారి ప్రయోజనాలకు భిన్నంగా మేం కేంద్ర ప్రభుత్వంలో పాలుపంచుకోలేమని బాదల్ అన్నారు.రైతుల ఆకాంక్షలను గౌరవించడంలో కేంద్రం విఫలమైనందునే..బీజేపీతో తమ పార్టీ చిరకాల మైత్రికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సివచ్చిందన్నారు. 

కొనసాగుతున్న రైతుల రైల్‌రోకో.. పంజాబ్‌లో రైళ్ల రద్దు

పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో రైల్‌ రోకో ఆందోళన కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని రైల్‌ రోకోలు నిర్వహిస్తున్నారు. 

తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అమృత్‌సర్‌లో అన్నదాతలు చొక్కాలు విప్పి బిల్లులపై తమ నిరసనను తీవ్రంగా వ్యక్తం చేశారు. 

చొక్కాలు విప్పి రైలు పట్టాలపై కూర్చుంటే అయినా కేంద్రం తమ గోడు వింటుందని కిసాన్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వణ్‌ సింగ్‌ పాంధేర్‌ అన్నారు. రైతుల నిరసనలతో రైల్వే అధికారులు మరో మూడు రోజులు రాష్ట్రంలో అన్ని పాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు.

Shiromani Akali Dal quits BJP-led NDA over farm bills

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   3 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   18 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   18 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle