Tamil Nadu Assembly Elections: అయ్యో చిన్నమ్మకు ఇలా జరిగిందేమిటి..!
06-04-202106-04-2021 09:45:40 IST
Updated On 06-04-2021 09:49:06 ISTUpdated On 06-04-20212021-04-06T04:15:40.896Z06-04-2021 2021-04-06T03:57:56.179Z - 2021-04-06T04:19:06.250Z - 06-04-2021

నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు మొదలయ్యాయి. అసోం, బెంగాల్లోనూ మలి విడత ఎన్నికలు జరగుతూ ఉన్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 3,998 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తమిళనాడులో ఈ ఎన్నికల కోసం 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, తమిళ మానిల కట్చి ఓ కూటమి కాగా... విపక్ష డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే మరో కూటమి. అటు కమలహాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం, ఐజేకే, ఏఐఎస్ఎంకే, నామ్ తమిళర్ కట్చి పార్టీలు మరో కూటమిగా బరిలో ఉన్నాయి. టీటీవీ దినకరన్ కు చెందిన ఏఎంఎంకే, డీఎండీకే, ఎస్పీడీఐ మరో కూటమిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళకు షాక్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. ఆమె పేరు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. ఓటరు జాబితాలో పేరు లేని కారణంగా శశికళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోయారు. మూడు దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ చిరునామాలోనే ఉంటున్న శశికళ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లిన తర్వాత జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అక్కడే నివసిస్తున్న శశికళ, ఇళవరసి సహా 19 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ శశికళ, ఇళవరసి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. శశికళ పేరును జాబితాలో చేర్చకపోవడంపై థౌజండ్ లైట్స్ ఏఎంఎంకే అభ్యర్థి వైద్యనాథన్ కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ తన కుమార్తెలు అక్షర హాసన్, శ్రుతి హాసన్‌లతో కలిసి చెన్నైలోని తేనాంపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ప్రముఖులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. Tamil Nadu Assembly Elections: చిన్నమ్మని మళ్ళీ పార్టీ లోకి ఆహ్వానించిన పన్నీర్ సెల్వం

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
16 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా