భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం సహాయం చేస్తోందట: సాక్షి మహారాజ్
14-01-202114-01-2021 20:29:46 IST
2021-01-14T14:59:46.744Z14-01-2021 2021-01-14T10:35:08.827Z - - 20-01-2021

సంచలన వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తర్వాతే ఎవరైనా.. ఇప్పటికే చాలా సార్లు ఆయన తన నోటికి పని చెప్పి వార్తల్లో నిలిచారు. కొన్ని కొన్ని సార్లు భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణం అయ్యారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆయన్ను సైలెంట్ గా ఉండమని చెప్పడంతో మునుపటిలా మరీ అంత పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు. తాజాగా మాత్రం ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదేమిటంటే బీజేపీకి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా సాయం చేస్తున్నారని..! భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ విధి విధానాలు ఎంఐఎం పార్టీకి ఏ మాత్రం సరితూగవని అందరికీ తెలిసిందే. ఎప్పుడు చూసినా భారతీయ జనతా పార్టీ మీద ఎంఐఎం నేతలు ఆరోపణలు చేస్తూ వస్తుంటారు. ఇక బీజేపీ నేతలు కూడా ఎంఐఎంకు కౌంటర్లు వేస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ నుండి దేశాన్ని విముక్తి చేయాలని ఆరోపణలు చేసే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అదే పార్టీకి ఎలా సహాయం చేస్తున్నారా అనే ప్రశ్న మన మదిని తొలచి వేస్తుంది. అది నిజమేనని యూపీలోని ఉన్నావో ఎంపీ సాక్షి మహారాజ్ చెబుతూ ఉన్నారు.
ప్రతి సారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సాక్షి మహారాజ్ ఈసారి లాజిక్ తో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ గత ఉదాహరణల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఎంఐఎం వల్లే బీజేపీ బీహార్లో ఓట్లు చీల్చి అత్యధిక స్థానాలు గెలుపొందిందని.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ ఒవైసీ పార్టీ పోటీ చేస్తుందని, అక్కడ కూడా తమ పార్టీ బీజేపీ గెలుపునకు ఒవైసీ సాయం చేయబోతున్నారని అన్నారు. నిజంగా ఇదొక అద్భుతమైన లాజిక్ అని ఆయన ఫాలోవర్లు చెబుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి ఎంఐఎం సిద్ధమవుతోంది. ఎంఐఎం పోటీ చేసి ఓట్లు చీల్చుతూ బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
3 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
4 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
5 hours ago

దేవినేని ఉమ విడుదల..!
7 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
8 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
8 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
10 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
12 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
14 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
15 hours ago
ఇంకా