newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

పాకిస్థాన్, చైనా క‌లిసి నాట‌కాలాడుతున్నాయా..!

13-10-202013-10-2020 17:47:18 IST
2020-10-13T12:17:18.705Z13-10-2020 2020-10-13T12:17:15.569Z - - 25-10-2020

పాకిస్థాన్, చైనా క‌లిసి నాట‌కాలాడుతున్నాయా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న‌క్క బుద్ధి న‌క్క బుధ్దే అంటారు క‌దా. అలాగే ఉంది పాకిస్థాన్ చైనా ఎవ్వారం. వాళ్ల దేశాల్ని డెవ‌ల‌ప్ చేసుకునేప‌ని వ‌దిలేసి.. వాళ్ల ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చ‌డం మానేసి.. ఎప్పుడు భార‌త్ భూ భాగాన్ని ఆక్ర‌మించుకుందామా అని చూస్తుంటాయి. క‌రోనాని కంట్రోల్ చేయ‌డం చేత కాదు.. బ‌యటి దేశాల‌కు పోకుండా ఆప‌డం చేత కాదు కానీ.. బోర్డ‌ర్ లో సైనికులను ఉసి గొల్పి.. భార‌త్ పైకి తోల‌డం మాత్రం వ‌చ్చు అంటూ అంద‌రూ తిట్టి పోస్తున్నారు. కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఒక ప‌థ‌కం ప్ర‌కార‌మే పాకిస్థాన్, చైనాలు క‌లిసి నాట‌కాలు ఆడుతున్నాయి అన్నారు మినిస్ట‌ర్ రాజ్ నాథ్ సింగ్.

బోర్డ‌ర్ లోని 44 బ్రిడ్జిల‌ను ప్రారంభించారు రాజ్ నాథ్ సింగ్. ప్రారంభించిన త‌ర్వాత‌.. రెండు దేశాల స‌రిహ‌ద్దుల స‌మ‌స్య‌ల‌పై సైనిక అధికారుల‌తో స‌మీక్షించారు ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ కామెంట్స్ చేశారు. భార‌త్ కు ఉత్త‌రాన‌, తూర్పున ఉన్న బోర్డ‌ర్ లో ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే ఇదొక మిష‌న్ లో భాగంగా చేస్తున్నార‌ని. కావాల‌నే రెచ్చ గొడుతున్నార‌ని వ్యాఖ్య‌లు చేశారు రాజ్ నాథ్ సింగ్. మొద‌ట్లో పాకిస్థాన్ రెచ్చి పోయింది.. ఇప్పుడు చైనా ఎగిరి ప‌డుతోంది. వాళ్లు ఎన్ని క‌త‌లు ప‌డ్డా.. త‌గ్గేదే లేద‌ని.. మోడీ సర్కార్ లో ధీటుగా ఎదుర్కొంటామ‌న్నారు రాజ్ నాథ్ సింగ్.

ఈ ప్రాంతాల్లో చారిత్ర‌క మార్పులు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. క‌రోనా టైమ్ లో కూడా బ్రిడ్జిలు నిర్మించిన బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్ ను అభినందించారు. ఈ రెండేళ్ల‌లోనే బోర్డ‌ర్ లో 2 వేల 2 వంద‌ల కిలోమీట‌ర్లు రోడ్లు నిర్మించింద‌ని.. బీ ఆర్ ఓ ను అభినందించారు రాజ్ నాథ్ సింగ్. మ‌రో 4 వేల 2 వంద‌ల కిలోమీట‌ర్ల రోడ్ ను కూడా త్వ‌ర‌గా కంప్లీట్ చేయాల‌న్నారు.

ఉద్రిక్తంగా ఉన్న ఈ టైమ్ లో బ్రిడ్జిలు నిర్మించడం కూడా పాయింటే. ఇష్యూ ఉన్న ఏరియాలోనే 7 బ్రిడ్జిలు ఉన్నాయి. వీటి ద్వారా స్థానికుల రాక‌పోక‌ల‌త‌తో పాటు.. సైనికుల‌కి కూడా ఆయుధ సామాగ్రిని త‌ర‌లించ‌డం ఈజీగా ఉంటుంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle