newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

జ‌ల్లిక‌ట్టు.. రాహుల్ పై బీజేపీ ప‌ట్టు

14-01-202114-01-2021 18:03:17 IST
2021-01-14T12:33:17.422Z14-01-2021 2021-01-14T12:33:09.384Z - - 20-01-2021

జ‌ల్లిక‌ట్టు.. రాహుల్ పై బీజేపీ ప‌ట్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జ‌ల్లిక‌ట్టు ఎంత ఫేమ‌స్సో తెలుసు క‌దా. ఎంత ఫేమ‌స్సో అన్ని విమ‌ర్శ‌లు ఉన్న‌య్. సంప్ర‌దాయం అని కొంత‌మంది.. సంస్కారం కాదు అని కొంత‌మంది. త‌ప్ప‌ని కొంత‌మంది.. ఏంటి త‌ప్ప‌ని ఇంకొంత మంది.. ఇలా ఎన్నో ఉన్న‌య్. మాన‌వ‌తా వాదులు.. ప‌శుప్రేమికులు ఎన్నో మాట‌లు అంటుంటారు. అటు కొంత‌మంది ఇటు కొంత‌మంది మాట్లాడుతుంటారు. సంక్రాంతి టైంలో.. జ‌ల్లిక‌ట్టు త‌మిళ్ నాడులో చాలా చాలా స్పెష‌ల్. ఇప్పుడు కూడా మ‌స్త్ జ‌రిగింది.

క‌రోనా టైం క‌దా.. చాలా కండిష‌న్స్. అయినా స‌రే.. త‌మిళ‌నాడు స‌ర్కార్ బానే యాక్సెప్ట్ చేసింది. కాక‌పోతే.. ఎందుకొచ్చిన గొడ‌వ‌లే అని.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి అని చెప్పింది. అంతా బానే పాటించారు. 150 మంది కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయ‌కూడ‌దు.. ఎప్ప‌టిలా పోలిస్తే.. స‌గం మంది కంటే ఎక్కువ మంది రాకూడ‌దు అంటూ.. నిర్వాహ‌కుల‌క‌కు తూతూ మంత్రంగా రూల్స్ పెట్టింది త‌మిళ‌నాడు స‌ర్కార్. ఎలాగూ ఆ రూల్స్ ని జనం పట్టించుకోరు అని తెలిసిందే క‌దా. ప‌నిలో ప‌నిగా.. కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియ‌ర్ లీడ‌ర్, యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ అయిన రాహుల్ గాంధీ కూడా వ‌చ్చారు. అక్క‌డ మొద‌లైంది అస‌లు ర‌చ్చ‌. కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. జ‌ల్లి క‌ట్టు నిర్వాహ‌కులు మాత్రం ఫుల్ గా రిసీవ్ చేసుకున్నారు. రాహుల్ గాంధీ రావ‌డంతో.. జ‌ల్లి క‌ట్టు ప్రాంగ‌ణం అంతా పావ‌నం అయింది అంటూ.. అంతా నెత్తిన పెట్టుకుని పొగ‌డ్త‌లతో ముంచెత్తారు.

కానీ.. బీజేపీ ఊరుకుంటుందా చెప్పండి. ఎట్టా వ‌స్తారు రాహుల్ గాంధీ మీరు అంటూ.. కామెంట్స్ మొద‌లెట్టేసింది. పండ‌క్కి పిలిచారు వ‌చ్చాను.. నాకు మాత్రం సంబ‌రం ఉండ‌దా.. సంక్రాంతి నేను మాత్రం జ‌రుపుకోకూడ‌దా అంటే ఊరుకుంటారా బీజేపీ వాళ్లు. వెళ్తే వెళ్లారు మేం వెళ్లొద్దు అన‌డం లేదు. మీరెట్టా వెళ్తారు అనేదే మా ప్ర‌శ్న అంటున్నారు బీజేపీ వాళ్లు. పోయిన ఎన్నిక‌ల‌కు ముందు ఏం చెప్పారో గుర్తుందా అని ప్ర‌శ్నించారు. జ‌ల్లి క‌ట్టు క‌రెక్ట్ కాదు. జ‌ల్లిక‌ట్టుని మా ప్ర‌భ‌త్వం బ్యాన్ చేస్తుంది. మూగజీవాల్ని హింసించ‌కూడ‌దు అంటూ డైలాగులు దంచారు క‌దా.. గుర్తు లేదా అంటున్నారు బీజేపీ లీడ‌ర్లు. మీకు మీరుగా జ‌ల్లిక‌ట్టుని వ్య‌తిరేకించి.. మీరే సంబ‌రాల‌కి వెళ్తే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. పాపం రాహుల్.. ఇంకేం చేస్తాడు చెప్పండి. .అప్పుడెందుకు అట్టా మాట్లాడానురా దేవుడా అని.. త‌ల ప‌ట్టుకున్నారు కావ‌చ్చు.

 

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   4 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   5 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   6 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   9 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   9 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   9 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   11 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   13 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   15 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   16 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle