newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్

09-03-202109-03-2021 10:12:36 IST
2021-03-09T04:42:36.837Z09-03-2021 2021-03-09T04:42:24.106Z - - 11-04-2021

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ నుంచి గెంతేసిన యువనేత జ్యోతిరాదిత్య చివరకు ఏం బాపుకున్నట్లు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జ్యోతిరాదిత్య ఇప్పటికీ పార్టీలోనే ఉండి ఉంటే అతడే కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ ఇప్పుడు బీజేపీలో ఎక్కడో వెనకబెంచీల్లో ఉండిపోయాడు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ మారడం చేయవద్దని పదే పదే సింధియాకు చెప్పానని కానీ ఆయన వేరే పంధా ఎంచుకుని బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీలో ఉన్నంత కాలం సింధియా ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేడు అని రాహుల్ వ్యాఖ్యానించారు. 

ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఉద్దేశించి సోమవారం ప్రసంగించిన రాహుల్.. ఒకవేళ సింధియా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చినప్పటికీ తాను ఇక ముఖ్యమంత్రి కాలేడని స్పష్టం చేశారు.

పార్టీ మారవద్దు. కాంగ్రెస్ లోనే ఉంటే ఏదో ఒక రోజు నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి అవుతారు అని సింధియాకు చిలక్కు చెప్పినట్లు చెప్పాను. కాని అప్పటికే సింధియా పార్టీ మార్పునకు సిద్ధమైపోయారు. విభిన్నపంధాను ఎంచుకున్నారు. 

పార్టీ మారకపోయి ఉంటే ఇప్పుడు తానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేవారు. ఇప్పుడు బీజీపీలో ఎక్కడో వెనక బెంచీల్లో ఉండిపోయారు. ఆ పార్టీలో ఉన్నంత వరకు సింధియా ముఖ్యమంత్రి కాలేడు. ఒకవేళ మళ్లీ మాతృసంస్థకు తిరిగొస్తే ఇక్కడా తనకు ముఖ్యమంత్రి పదవి లభించదు అని రాహుల్ తేల్చి చెప్పారు.

గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి షాక్ కలిగిస్తూ సింధియా కొంతమంది శాసనసభ్యులతోపాటు మధ్యప్రదేశ్ బీజేపీలోచేరిపోయారు. దీంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పగూలిపోయింది. 

అయితే సింధియా గురించి రాహుల్ అలాంటి వ్యాఖ్య చేయలేదని ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తోసిపుచ్చారు. రాహుల్ వ్యాఖ్యగా మీడియాలో వచ్చిన వార్త సరైంది కాదన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరాలని, వైదొలగాలని ఎవరైనా అనుకుంటే నిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చని మాత్రమే రాహుల్ గాంధీ చెప్పారు. ఆరెస్సెస్-బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా యువజన సంస్థ చేస్తున్న పోరాటాన్ని కొనసాగించాలని రాహుల్ పేర్కొన్నారని బీవీ శ్రీనివాస్ తెలిపారు. రాజకీయాలు అంటే దీర్ఘకాలిక ప్రక్రియ అని పార్టీకోసం నిజాయితీగా పనిచేసే వారికి, విశ్వాసంతో ఉన్నవారికి తప్పకుండా ప్రతిఫలం లభిస్తుందని రాహుల్ తమ సమావేశంలో సూచించారని శ్రీనివాస్ చెప్పారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   15 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   18 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle