newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

మిస్ట‌ర్ క్యూ పీఎం

13-05-202113-05-2021 10:06:51 IST
Updated On 13-05-2021 10:24:40 ISTUpdated On 13-05-20212021-05-13T04:36:51.439Z13-05-2021 2021-05-13T04:36:41.459Z - 2021-05-13T04:54:40.321Z - 13-05-2021

మిస్ట‌ర్ క్యూ పీఎం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మిస్ట‌ర్ క్యూ పీఎం.. మిస్ట‌ర్ క్యూ పీఎం. ఇదే మాట‌. సోష‌ల్ మీడియాలో కొత్త‌గా వినిపిస్తున్న మాట ఇది. అంద‌రూ ఇదే జ‌పం చేస్తున్నారు. జ‌పం కాదు. టార్గెట్ చేస్తున్నారు. ఒక‌ప్పుడు అంటే.. ప్రైమ్ మినిస్ట‌ర్ మోడీని మాట అనే ప‌రిస్థితి లేదు. సోష‌ల్ మీడియాలో మోడీ సైన్యం ఉండేది. సైన్యం సూప‌ర్ యాక్టివ్ గా.. హైప‌ర్ యాక్టివ్ గా  ఉండేది. ఇప్పుడు ఆ సైన్యం కూడా ఆయుధాలు వ‌ర‌లో పెట్టుకుని.. త‌ల దించుకుని కూర్చోవాల్సి వ‌స్తోంది. లేదంటే.. సోష‌ల్ మీడియాలో మోడీతో పాటు.. వారిపై కూడా అటాక్ లు త‌ప్పేలా లేవు. అలాగే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో మోడీని క‌వ‌ర్ చేసే ప‌రిస్థితి  లేదు. మోడీకి స‌పోర్టింగ్ ఎవ‌రైనా మాట్లాడితే.. పిచ్చోళ్ల కింద లెక్క‌గ‌ట్టేస్తున్నారు. అమాయ‌క‌త్వంతో, మూఢ‌త్వంతో ఉన్న వారిలా చూస్తున్నారు.

ఇక పీఎం మోడీకి.. క్యూ పీఎం అని కొత్త బిరుదు ఇచ్చారు. హాష్ ట్యాగుల‌తో ఆడేసుకుంటున్నారు. క్యూ పీఎం అంటే అర్దం అవుతూనే ఉంది క‌దా. మీరు అనుకున్న‌ది క‌రెక్టే. అప్ప‌ట్లో నోట్లు ర‌ద్దు చేశారు. అర్ద‌రాత్రి నిర్ణ‌యం తీసుకుని.. ఇవేం ప‌నులు సామే అన్నారు. చిల్ల‌ర కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేశారో చూశాం క‌దా. ముఖ్యంగా ఏటీఎంల ముందు క్యూ క‌ట్టిన రోజులు ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు క‌దా. ఇక పోతే.. రీసెంట్ గా వ్యాక్సిన్ కోసం క్యూ క‌ట్టారు. ముందు ముందే బ‌య‌టి దేశాల‌కి పెద్ద గొప్ప‌లు చెప్పుకుంటూ వ్యాక్సిన్ పంపి.. మ‌నోళ్ల‌కి మాత్రం వ్యాక్సిన్ లేకుండా చేశారు మోడీ.

సో.. వ్యాక్సిన్ కోసం క్యూలు త‌ప్ప‌డం లేదు. క‌రోనా టెస్టుల కోసం క్యూలు త‌ప్ప‌డం లేదు. అలాగే.. శ్మ‌శానాల ముందు జ‌నాల క్యూ త‌ప్ప‌డం లేదు. శ‌వాలు కూడా క్యూ క‌ట్ట‌క త‌ప్ప‌డం లేదు. అంతా క్యూ మ‌యం అయిపోయింది అంటూ.. సోష‌ల్  మీడియాలో మోడీని ఆడేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ తోనే పీఎం అయ్యారు అనే ముద్ర మోడీపై ఉంది క‌దా. ఇప్పుడు కూడా సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ తోనే ఈసారి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఆయ‌న పేరు తొల‌గిస్తుంది బీజేపీ అంటున్నారు. ఆల్రెడీ నెక్స్ట్ ప్ర‌ధాని అభ్య‌ర్థి మోడీ కాదు అనే టాక్ న‌డుస్తోంది క‌దా.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle