రైతుల ఉద్యమంలో విధ్వంసకారులు.. 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
28-01-202128-01-2021 08:51:26 IST
Updated On 28-01-2021 09:33:17 ISTUpdated On 28-01-20212021-01-28T03:21:26.884Z28-01-2021 2021-01-28T03:21:24.134Z - 2021-01-28T04:03:17.100Z - 28-01-2021

గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో నిరసన ప్రదర్శనలు కాస్తా విధ్వంసానికి దారి తీశాయి. రైతుల ట్రాక్టర్ ర్యాలీ, ఎర్రకోట ముట్టడి ఘటనలు హింసాత్మకంగా మారడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆ అల్లర్లలో భాగంగా 25 క్రిమినల్ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అలాగే 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. రైతులకు సారథ్యం వహిస్తున్న రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్, మేధాపాట్కర్, దర్శన్ పాల్, గుర్నాంసింగ్ చాదుని సహా మొత్తం 37 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ట్రాక్టర్ ర్యాలీ, ఎర్రకోట ముట్టడిలో హింసకు దారి తీసిన ఘటనపై దృష్టిసారించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొందరు నేతల రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్.ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం నాటి ఘటనలో ఆరు బస్సులు, ఐదు పోలీసు వాహనాలు దెబ్బతిన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆందోళనకారుల చేతుల్లో 394 మంది పోలీసులు గాయపడినట్టు తెలిపారు. ఢిల్లీలోకి బలవంతంగా ప్రవేశించే ఉద్దేశంతో బారికేడ్లను బద్దలుగొట్టేందుకు ప్రయత్నించారంటూ 2 వేల మందిపై హర్యానాలోని పల్వాల్ జిల్లాలో కేసు నమోదైంది. ఢిల్లీలో జరిగిన ఘటనలపై సిగ్గుపడుతున్నానని, దీనికి బాధ్యత తీసుకుంటున్నానని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు, రైతు నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటనలకు సిగ్గుపడుతున్నా. వీటికి బాధ్యత తీసుకుంటున్నా అన్నారు. రైతు ఉద్యమానికి కొందరిని దూరం పెట్టాం, వారే ఈ దుశ్చర్యలకు బాధ్యులని తెలుస్తోంది అని వివరించారు. ఎర్రకోటలో జరిగిన ఘటనలకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కారణమని పంజాబ్‌కు చెందిన కిసాన్ బచావ్ మోర్చా నాయకుడు కృపా సింగ్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి మేజర్ సింగ్ పుణెవాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రాక్టర్ ర్యాలీలో చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. ట్రాక్టర్ పరేడ్ కోసం పోలీసులు నిర్దేశించిన మార్గాన్నే కవాతులో పాల్గొన్న 32 రైతు సంస్థలు అనుసరించాయని తెలిపారు.

బలంగా ప్రతి పక్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్పదా
40 minutes ago

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
8 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
9 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
16 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
15 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
17 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
17 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
19 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
a day ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago
ఇంకా