newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

కారు లేదు. అప్పులు లేవు.. వ్యాపారాలూ లేవు.. దటీజ్ మోదీ

16-10-202016-10-2020 15:15:57 IST
2020-10-16T09:45:57.014Z16-10-2020 2020-10-16T09:45:54.261Z - - 25-10-2020

కారు లేదు. అప్పులు లేవు.. వ్యాపారాలూ లేవు.. దటీజ్ మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోనే కాదు.. ప్రపంచంలో కూడా తనకంటూ సొంతానికి కనీసం ఒక కారు లేకుండా ఒక ప్రధాని స్థాయి వ్యక్తి జీవిస్తున్నారంటే నిజంగా అద్భుతమే అని చెప్పాలి. అయన మరెవరో కాదు. మన ప్రధాని. మన నరేంద్రమోదీ.  ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీకి కారు లేదు. అప్పులు లేవు, వ్యాపారాలు అసలే లేవు. మరి ప్రధానిగా తనకు లభిస్తున్న వేతనాన్ని ఆయన ఎలా ఖర్చుపెడతారో చూద్దాం.

సగటు వేతన జీవిలా తనకు వచ్చే వేతనాన్ని ప్రధాని మోదీ బ్యాంకు ఖాతాల్లో, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో భద్రంగా దాచుకుంటున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఆయన ఎక్కువగా తనకి వచ్చే వేతనాన్ని నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ), జీవిత బీమా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల రూపంలో ఉంచుతున్నారు. 

గత ఏడాదితో పోల్చి చూస్తే ఆయన ఆదాయంలో రూ.36.53 లక్షలు పెరుగుదల కనిపించింది. మోదీ తాజాగా తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ప్రధాని మొత్తం ఆస్తుల విలువ రూ.2.85 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ.2.49 కోట్ల చరాస్తులుంటే ఏడాదిలో 26.26% పెరుగుదల కనిపించింది.  

మోదీ నెల జీతం రూ. 2 లక్షలు. అందులో కరోనా సాయం కింద 30% ఆయన వేతనంలోంచి కట్‌ అవుతోంది.  ప్రధాని సేవింగ్స్‌ అకౌంట్‌లో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన దగ్గర ప్రస్తుతం రూ.31,450 మాత్రమే ఉన్నాయి. 2019లో రూ.2.49 కోట్లు ఉన్న 70 ఏళ్ల మోదీ ఆస్తి 2020 నాటికి రూ.2.85 కోట్లకు పెరిగింది. బ్యాంకు బ్యాలెన్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రాబడి వల్లే మోదీ ఆస్తుల్లో రూ.36 లక్షల పెరుగుదల కనిపించింది.

గుజరాత్‌ గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ అకౌంట్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో రూ.1.60 కోట్ల ఉన్నాయి.  నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ రూపంలో రూ. 8.5 లక్షలు. రూ. 7.61 లక్షలు ఉన్నాయి. జీవిత బీమా పథకం కింద రూ.1.51 లక్షలు, రూ.1.90 లక్షలు కడుతూ ఉంటారు. ప్రధానికి నాలుగు బంగారం ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువుండే వాటి విలువ రూ. 1.5 లక్షలుగా ఉంది. గాంధీనగర్‌లో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. కుటుంబ సభ్యులతో పాటు మోదీకి ఆ ఇంట్లో 25% హక్కు ఉంది. 

అన్నిటికంటే మించి.. ప్రధానికి సొంత కారు లేదు. అప్పులు కూడా లేవు. గత ఏడాదితో పోలిస్తే ప్రధాని మోదీ ఆస్తులు పెరిగాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆస్తులు మాత్రం తగ్గాయి. ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ నాటికి మోదీ, షా సహా కేంద్ర మంత్రుల ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం గురువారం వెల్లడించింది. మోదీ కేబినెట్‌లో అత్యంత ధనవంతుడైన మంత్రిగా పియూష్‌ నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.78.27 కోట్లకు చేరుకుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle