newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ఏం చేస్తున్నారు... కోవిడ్ పై నాలుగు రాష్ట్రాల సీఎం లకు ప్రధాని ఫోన్

09-05-202109-05-2021 19:37:50 IST
2021-05-09T14:07:50.315Z09-05-2021 2021-05-09T14:07:38.862Z - - 25-07-2021

ఏం చేస్తున్నారు... కోవిడ్ పై  నాలుగు రాష్ట్రాల సీఎం లకు ప్రధాని ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ: కోవిడ్  వైరస్ తీవ్రంగా ఉన్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మాట్లాడి ఆ రాష్ట్రాలలో వైరస్ పరిస్థితి గురించి తీసుకుంటున్న నివారణ, నిరోధక చర్యల గురించి చర్చించారు. పంజాబ్, కర్ణాటక, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కోవిడ్ వైరస్ తీవ్రంగా ఉందని,  మరణాల సంఖ్య పెరుగుతుందన్న కథనాల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ కీలక భేటీ జరిపారు. గత కొన్ని రోజులుగా కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కూడా మాట్లాడుతున్న మోడీ వైరస్ పరిష్టితిని ఎదుర్కొనేందుకు కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశారు. ఈ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మోడీకి తాజా పరిష్టితి వివరించండంతో పాటు వైరస్ తీవ్రతను నిరోధించేందుకు తాము తీసుకుంటున్న చర్యల గురించి కూడా తెలియజేశారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఎలా ఉందని ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ఏ రకమైన చర్యలు చేపడుతున్నారంటూ మోడీ తనకు ఫోన్ చేసినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రావత్ తెలిపారు.

దాదాపు 91 లక్షల మందికి పైగా కుంభమేళాకు మార్చి, ఏప్రిల్ నెలల్లో హాజరైన నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా వైరస్ భీకర రూపుదాల్చింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాణాంతక వైరస్ తీవ్రత అడ్డూ అదుపూ లేని విధంగా రాష్ట్రంలో పెరుగుతూ వచ్చింది. గత ఏడు రోజులుగా రోజుకు 7 వేలకు పైగానే ఉత్తరాఖండ్ లో కేసులు నమోదవుతున్నాయి. కుంభమేళా విషాదంతో రాష్ట్ర ప్రభుత్వం చార్ ధామ్ యాత్రను వాయిదా వేసింది. నిజానికి ఈ నెల 14 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కావలసి ఉంది. యావత్ భారతాన్ని కోవిడ్ వైరస్ కబళిస్తున్న నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో ఎందుకు కుంభమేళాను నిర్వహించారన్న విమర్శలు ఇటు కేంద్ర  ప్రభుత్వాన్ని, అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముంచెత్తాయి.   కుంభమేళాను నిర్వహించకుండా ఉండి ఉంటే పరిష్టితి ఇంత తీవ్ర స్థాయికి చేరుకునేదే కాదన్న విమర్శలూ వచ్చాయి. సోమవారం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించిన  పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారించబోతోంది. కుంభమేళాతో పాటు వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోవిడ్  నిబంధనలను ఉల్లంఘించారన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు విచారించబోతోంది. కుంభమేళా కోసం రైల్వలు  ప్రత్యేక రైళ్లను వేసిన విషయం కూడా ఈ సందర్బంగా పరిశీలించనున్నారు. మొత్తం మీద దేశంలో కరోనా కేసుల తీవ్రతకు సంబంధించిన  అంశాలపై  కూడా సుప్రీంకోర్టు దృష్టి పెట్టనుంది. ఈ అంశాలన్నింటినీ కూడా పిటీషనర్ తన పిటీషన్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.   

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   3 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   10 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   10 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   11 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle