newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

10-04-202110-04-2021 18:05:04 IST
Updated On 10-04-2021 13:43:53 ISTUpdated On 10-04-20212021-04-10T12:35:04.025Z10-04-2021 2021-04-10T07:41:19.955Z - 2021-04-10T08:13:53.532Z - 10-04-2021

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పీకే పీకే పీకే. ఎన్నిక‌ల టైం వ‌స్తే.. ఈ పేరు బ‌లంగా వినిపిస్తుంది. ఆ మ‌ధ్య ఏపీలో కూడా ఈ పేరు బానే వినిపించింది క‌దా. ఇక ఈ మ‌ధ్య ప‌శ్చిమ బెంగాల్ లో కూడా పీకే పేరు బానే వినిపిస్తోంది. ఎందుకంటే.. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. ఎలాగైనా గెలిచి తీరాలి.. హ్యాట్రిక్ సీఎం కావాలి.. బీజేపీ అటాక్ ని తిప్పి కొట్టాలి. బెంగాల్ లోకి బీజేపీని రానివ్వ‌కూడ‌దు అంటూ.. రాజ‌కీయ వ్యూహ క‌ర్తగా పీకేను ఫిక్స్ చేసుకున్నారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే వెళ్తున్నారు. 

కానీ.. స‌డ‌న్ గా ఏం జ‌రిగిందో ఏమో తెలీదు. ఓ బీజేపీ లీడ‌ర్ ఓ వీడియోను లీక్ చేశాడు. అందులో.. ప్ర‌శాంత్ కిశోర్.. మ‌మ‌త పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడాడు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీదే పై చేయిగా ఉంది. ఈసారి బీజేపీ బెంగాల్ లో ప్ర‌భుత్వం ఫామ్ చేస్తుంది. మ‌మ‌త పార్టీ ఓడిపోతుంది అనే వ్యాఖ్య‌లు చేశాడు. మ‌మ‌తా బెన‌ర్జీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న పీకే.. ఇలా హ్యాండివ్వ‌డం ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

బీజేపీ కొనేసిందా అంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. అయినా.. పీకే వ్యూహ క‌ర్త‌గా పేరు తెచ్చుకున్నాడు అంటే.. అది త‌న క్రెడిబులిటీపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక వేళ‌.. రాజ‌కీయ వ్యూహంలో భాగంగా.. బీజేపీ త‌ర‌పున రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న పీకే.. వ్యూహంలో భాగంగా మ‌మ‌తా వైపు చేరాడా అనే టాక్ కూడా బ‌య‌టికి వ‌చ్చింది. ఇవ‌న్నీ హాలీవుడ్ మూవీస్ లో జ‌రుగుతుంటాయి. మ‌రి పీకే కూడా అదే ఫార్మాట్ ని వెస్ట్ బెంగాల్ లో అమ‌లు చేశాడా ఏంటి అంటున్నారు.

అయితే.. ఈ వీడియో లీక్ పై పీకే కూడా నెగటివ్ గా మాట్లాడ‌లేదు. కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. పైగా.. త‌న మాట‌ల వీడియోని ఫుల్ గా రివీల్ చేయ‌మ‌ని కోర‌డం మ‌రో ట్విస్ట్. ఇదేంట్రా బాబూ.. నాలుగో విడ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్న టైంలో.. పీకే ఇలా ట్విస్టులు ఇస్తున్నాడేంటి అనుకుంటున్నారు. ఆయ‌న చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. నిజంగానే వెస్ట్ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందా.. మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌తే.. ఆమె పార్టీని ఓడిస్తుందా అనే లెక్క‌ల్లోకి వెళ్లారు జ‌నాలు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle