newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

Tamil Nadu Assembly Elections: చిన్నమ్మని మళ్ళీ పార్టీ లోకి ఆహ్వానించిన పన్నీర్ సెల్వం

26-03-202126-03-2021 18:17:48 IST
2021-03-26T12:47:48.242Z26-03-2021 2021-03-26T11:07:52.354Z - - 16-04-2021

Tamil Nadu Assembly Elections: చిన్నమ్మని మళ్ళీ పార్టీ లోకి ఆహ్వానించిన పన్నీర్ సెల్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. ఇక రాజకీయ జీవితం తనకు వద్దు అంటూ అస్త్ర సన్యాసం చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ముందు మరోసారి అన్నాడీఎంకే నాయకత్వం సాగిలపడనుందా.. అంటే అవుననే సమాధానం. ఇటీవలి కాలంలో తమిళనాడు అసెంబ్లీలో గెలుపోటములపై సర్వేలు నిర్వహిస్తున్న ప్రతి సంస్థా డీఎంకే అప్రతిహత విజయం సాధించనుందని ఢంకా భజాయిస్తున్న నేపథ్యంలో చిన్నమ్మే పార్టీకి శరణ్యం అని అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం తేల్చేసుకుని ఆమెకు సాదర స్వాగతం కూడా పలికేశారు.

ఒకప్పుడు V.K శశికళ నమ్మినబంటుగా వ్యవహరించి ఆమె ఆశీర్వాద బలంతోనే తమిళనాడు ముఖ్యమంత్రి పదివిని చేజిక్కిచుకున్న సీఎం ఎడపాడి పళనిస్వామి తాజా పరిణామంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా, తనను సీఎం పదవి నుంచి గద్దె దింపిన శశికళను బీజేపీ దన్నుతో జైలుకు పంపేంతవరకు తెగించిన పన్నీర్ సెల్వం ఆదే చిన్నమ్మను పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానం పలకడం విశేషం.

ప్రతిపక్ష డీఎంకేను ఈ ఎన్నికల్లో ఓడించడం సులభం కాదని జ్ఞానోదయం కలిగినందునే శశికళ బద్ద విరోధి పన్నీర్ సెల్వం తనంత తానుగా శశికళను అన్నాడీఎంకేలోకి ఆహ్వానించడం ముఖ్యమంత్రి పళనిస్వామికి మొదట్లో మింగుడు పడలేదు. మాటమాత్రమైనా తనతో చెప్పకుండా పన్నీర్‌ చేసిన ప్రకటనపై పార్టీ  సహ సమన్వయ కర్త, సీఎం ఎడపాడి పళనిస్వామి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

అయితే తాజా సమాచారం ప్రకారం శశికళ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇరువురూ రహస్యంగా మంతనాలు చేశారని, అన్నాడీఎంకే గెలుపు అవకాశాలు, టీటీవీ దినకరన్‌ పార్టీ అభ్యర్థుల వల్ల ఓట్ల చీలిక, ఉత్తర, దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే పరపతి, కొంగుమండలంలోని అన్నా డీఎంకే ఓట్‌ బ్యాంకు అంశాలపై కూడా ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. 

గెలుపు అనుమానంగా మారుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులపై పట్టుఉన్న, ప్రజల్లో చిన్నమ్మగా ఆకర్షణ ఉన్న శశికళను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీకి మేలు జరుగుతుందని వీరిద్దరూ అభిప్రాయానికి వచ్చిన తర్వాతే శశికళకు ఆహ్వానం పంపుతూ పన్నీర్ స్వామి ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఈ క్రమంలోనే తనకు శశికళతో ఎలాంటి విభేదాలు, మనస్తాపాలు లేవని, అమ్మ జయలలిత మరణించిన సందర్భంగా కొన్ని సందేహాలు ఉండేవి తప్ప ఆమె పట్ల వ్యక్తిగతంగా తనుకు ఎలాంటి శత్రుత్వమూ లేదని పన్నీర్ స్వామి చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎంలాగా ఒక సమన్వయ కర్తగా పార్టీలో కొనసాగేందుకు ఆమె అంగీకరిస్తే శశికళను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తామని పన్నీర్ సెల్వం చేసిన ప్రకటన అన్నాడీఎంకే వర్గాల్లోని సంచలనం గొలుపుతోంది.

అన్నాడీఎంకేలో అధ్యక్ష విధానం దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా జయలలితతో ముగిసిపోయింది. అప్పటినుంచి పార్టీలో సమన్వయకర్తగా ఎడపాడి, సహ సమన్వయ కర్తగా పన్నీర్ స్వామి అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే నాలుగేళ్లు పరప్పన జైలులో శిక్ష అనుభవించిన తర్వాత బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకున్న శశికళ బీజేపీ తీవ్ర ఒత్తిడితో రాజకీయాలనుంచి వైదొలుగుతున్నానని, అన్నాడీంకే, బీజేపీ కూటమి ఓట్లు చీల్చే ఉద్దేశం తనకు లేదని చెప్పి సైలెంట్ అయిపోయారు.

కానీ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని అన్ని సర్వేలు సంకేతాలు వెలువరిస్తున్న నేపథ్యంలో కూటమిని నిలబెట్టే పాత్రలోకి శశికళ ప్రవేశంచిడానికి ఎక్కువ రోజులు పట్టదని భావిస్తున్నారు.

అయితే శశికళ ఇప్పుడు రాజకీయేతర వ్యక్తిగా మారిపోయినందున ఆమె రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించడంపై ఎలాంటి చర్చా జరపాల్సిన అవసరం లేదని పన్నీర్ సెల్వం సన్నిహిత సహచరుడు మాజీ ఆర్థిక మంత్రి సి పొన్నియన్ తేల్చి చెప్పడం ఆసక్తి గొలుపుతోంది. మరోవైపున అన్నాడీఎంకే ప్రధాన పదవిపై ఆసక్తి చూపకుంటే శశికళను పార్టీలోకి తిరిగి ఆహ్వానించడంలో ఏ సమస్యా లేనది పన్నీస్ సెల్వం వివరణ ఇవ్వడంతో పార్టీలోకి శశికళ రాకకు మార్గం సుగమమైనట్లేనని పరిశీలకుల అంచనా.

2017లో శశికళను అన్ని పదవుల నుంచి ఊడబెరికి పార్టీ పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న ఎడపాడి, పన్నీర్ సెల్వం ద్వయం.. మారిన పరిస్థితుల్లో ఆమెకు ఆహ్వానం పలకాల్సి రావడం చూస్తుంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వాలు, శాశ్వత శత్రుత్వాలు ఉండవని మరోసారి రుజవయినట్లే కదా.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle