newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

19-10-202019-10-2020 10:20:15 IST
Updated On 19-10-2020 10:25:47 ISTUpdated On 19-10-20202020-10-19T04:50:15.712Z19-10-2020 2020-10-19T04:50:08.311Z - 2020-10-19T04:55:47.112Z - 19-10-2020

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎగిరి ప‌డితే ఎన్నాళ్లు చెప్పండి. ఎగిరి పోక త‌ప్ప‌దు. ఇప్పుడు పాకిస్థాన్ ప్ర‌ధానికీ ఈ ప‌రిస్థితి త‌ప్పేలా లేదు. పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ప్ర‌పంచం అంతా తెలిసిందే క‌దా. సైలెంట్ గా ఉన్నా.. గోతులు త‌వ్వే య‌వ్వారాలు చేస్తుంటార‌ని.. అంద‌రూ తిట్టి పోస్తుంటారు. అస‌లే పాకిస్థాన్ పై వ‌ర‌ల్డ్ వైడ్ గా నెగ‌టివిటీ ఉంది. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌ధాని అయిన త‌ర్వాత అదిఇంకా పెరిగింది. అందుకే.. బ‌య‌టి దేశాల వారికే కాదు.

అక్క‌డి జ‌నాల‌కి కూడా చిర్రెత్తుకొస్తుందంట‌. బ‌య‌ట దేశాల‌తో.. ఎలా ఉండాలో తెలీదు అంటూ నానా మాట‌లూ అంటున్నార‌ట‌. ఎన‌క‌టి రోజుల్లో అంటే ఎమోష‌న‌ల్ గా రెచ్చ‌గొడితే ఎర్రెక్కే వాళ్లు.. ఇప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అందుకే.. మెచ్యూర్డ్ పీపుల్ అంతా సారు వార్ని ఎప్పుడు గ‌ద్దె దింపుదామా అని చూస్తున్నార‌ట‌. కేవ‌లం సారు వారినే కాదు. ఇమ్రాన్ గ‌వ‌ర్న‌మెంట్ మొత్తాన్ని కూల్చేసి.. కొత్త గ‌వర్న‌మెంట్ ఏర్పాటుచేసే ప‌నిలో ఉన్నార‌ట‌. 

నిజ‌మే అక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితులు చూస్తుంటే ఇమ్రాన్ ప్ర‌భుత్వానికి మూడిన‌ట్లే ఉంది. విప‌క్ష కూట‌మి బ‌లంగా మారుతోందంట‌. ఈ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి.. మంచి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా వెళ్తున్నాం అంటూ.. కరాచీలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక పార్టీల‌న్నీ ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అప్ప‌టి పీఎం భుట్టో స‌పోర్ట‌ర్స్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇమ్రాన్ దెబ్బ‌కి త‌ట్టుకోలేక బ‌య‌టి దేశాల్లో త‌ల దాచుకుంటున్న లీడ‌ర్లు కూడా నిన్న ర్యాలీకి రావ‌డంతో అక్క‌డి పాలిటిక్స్ సీరియ‌స్ గానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle