newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

30-09-202030-09-2020 15:05:45 IST
Updated On 30-09-2020 15:20:42 ISTUpdated On 30-09-20202020-09-30T09:35:45.666Z30-09-2020 2020-09-30T09:35:33.201Z - 2020-09-30T09:50:42.722Z - 30-09-2020

కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా.. ప్రపంచ వ్యాప్తంగా మానవాళి మనుగడనే ప్రశ్నార్ధకం  చేసే రీతిలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. న్యూజిలాండ్, రష్యా, బ్రిటన్ వంటి దేశాని కట్టడి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయడంతో ఆయా దేశాలలో వ్యాధి వ్యాప్తి తీవ్రత అదుపులోనికి వచ్చినట్లే కనిపిస్తున్నది. అయితే భారత్ లో మాత్రం తొలి రోజులలో చూపినంత శ్రద్ధ మహమ్మారి వ్యాధి వ్యాప్తి తీవ్రత అధికమైనప్పుడు చూపడం లేదు. ఫలితమే...దేశంలో రోజుకు 80 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. ఇప్పటికే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్...వ్యాప్తి తీవ్రత ఇలాగే కొనసాగితే అగ్రస్థానానికి చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారత్ లో కరోనా కట్టడి చర్యల కంటే కరోనాతో సహజీవనం చేయాల్సిందేననీ, కరోనా సోకితే అది సోకిన వారి దురదృష్టమని చెప్పకనే చెబుతున్నట్లుగా ప్రభుత్వాల తీరు ఉంది. ఈ విషయంలో ప్రజాగ్రహాన్ని తట్టుకోవడానికా అన్నట్లు వారం రోజులకో, పది రోజులకో ఒక సారి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ కరోనా వ్యాక్సిన్ ఇదిగో అప్పుడొస్తుంది, ఇప్పుడొస్తుంది అని ప్రకటనలు గుప్పిస్తుంటారు.

మళ్లీ ఆయనే దేశంలో ప్రజలలో యాంటీ బాడీస్ డెవలప్ కావడం లేదననీ, కరోనా సోకి తగ్గిన వ్యక్తి కూడా మళ్లీ కరోనా బారిన పడుతున్న సంఘటనలను ఉటంకిస్తున్నారు. ఆయన ప్రకటనల్లోనే దేశంలో కరోనా విలయం ఎంత తీవ్రంగా ఉందన్నది అవగతమౌతున్నది. ఆ తీవ్రతను తగ్గించడానికీ, ప్రజారోగ్య రక్షణ చర్యలకు ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రణాళికలేమిటి? అన్న విషయంలో మాత్రం అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ నోరు మెదపడంలేదు. ఇన్నీ టెస్టులు చేశాం, అన్ని టెస్టులు చేశాం అని చెప్పుకోవడానికే ప్రభుత్వాల ప్రకటనలు పరిమితమౌతున్న పరిస్థితి గోచరిస్తున్నది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళన కర స్థాయిలో ఉంది. ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, ప్రసిద్ధులు కూడా కరోనా బారిన పడటం చూస్తుంటే...వారే మహమ్మారి బారినుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమౌతున్నది.

అసలు దేశంలో కరోనాకు సంబంధించి వెలువడుతున్న గణాంకాంలు విశ్వసనీయమేనా అన్న అనుమానం కూడా వ్యక్తమౌతున్నది. ఒక వైపు కరోనా కేసులు తగ్గుతున్నాయని కేంద్రం స్వయంగా ప్రకటిస్తూ...రికవరీ రేటు ఇతర దేశాల కంటే అధికంగా ఉందని చెప్పుకుంటున్నది. అయితే వరల్డో మీటర్ సమాచారంతో పోల్చి చూసినప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు వాస్తవ లెక్కలను వెల్లడించడం లేదని పరిశలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ప్రజల అభిమాన గాయకుడు ఎస్పీ బాలససుబ్రమణ్యం మృత్యువాత పడ్డారు. కర్నాటక, తమిళనాడు, ఎపిలో ఒక్కో ఎంపి మృతి చెందారు. ఉత్తరాదిలో అనేకమంది ప్రముఖలు కూడా మృత్యువాత పడ్డారు. అయినా అది అదుపులోనే ఉందని చెపðకోవడం ఆత్మహత్యా సదృశ్యం తప్ప మరోటి కాదు.

తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎపికి చెందిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, ఇద్దరు ఎపి మంత్రులు వేణుగోపాల్‌, వెల్లంపల్లి శ్రీనివాసులు కూడా కరోనా బారిన పడ్డారు. తెలంగాణలోనూ పలువురు ఎమ్మెల్యేల కు కరోనా సోకింది. ఈ దశలో కరోనా తగ్గిందని చెప్పడం...ప్రమాద తీవ్రతను తగ్గించి చూపడానికి చేస్తున్న ప్రయత్నమే కానీ మరొకటి కాదు. ప్రజలకు వాస్తవాలు వివరిస్తూనే...కరోనా కట్టడికి మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అలాగే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రికవరీల లెక్కల కంటే, మహమ్మారి బారిన పడిన వారికి అందుతున్న వైద్య సేవలపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ విస్మరించి మహమ్మారి అదుపులో ఉందంటూ ప్రకటనలు చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందే తప్ప మరో ప్రయోజనం సిద్ధించదు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle