మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా.. ఆధారాలు లేవన్న మంత్రి గిరిరాజ్
12-01-202112-01-2021 16:43:25 IST
2021-01-12T11:13:25.468Z12-01-2021 2021-01-12T11:13:23.329Z - - 20-01-2021

మానవులకు బర్డ్ ఫ్లూ సోకుతున్న ఉదంతాలకు శాస్రీయంగా ఆధారాలు లేవని కేంద్ర పశుసంవర్థక మంత్రి గిరరాజ్ సింగ్ పేర్కొన్నారు. వినియోగదారులు అనవసరంగా భయాందోళనలకు గురికావద్దని సూచించారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు హోల్ సేల్ మార్కెట్లను మూసివేయడం లేక పౌల్ట్రీ ఉత్పత్తులపై ఆంక్షలు విధించవద్దని కేంద్రమంత్రి సూచించారు. జాతీయ రాజధాని ఢిల్లీ వెలుపలనుంచి ప్రాసెస్ చేసిన, ప్యాకేజి చేసిన చికెన్‌పై నిషేధం విధిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి దానికి వ్యతిరేకంగా స్పందించడం విశేషం. ఢిల్లీలోని ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మూసివేయాలని డిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సంక్రమిస్తుందని శాస్త్రీయ, సాంకేతిక కారణాలు లభ్యమైనట్లయితే అలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకోవచ్చని అలాంటివేవీ లేకుండా నిషేధాలు విధిస్తే పౌల్ట్రీ రైతులే కాకుండా మొక్కజొన్న రైతులు కూడా దెబ్బతింటారని కేంద్ర మంత్రి చెప్పారు. కాగా దేశంలోని పది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఇప్పటికి కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర లకు బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ కూడా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే పౌల్ట్రీ ఉత్పత్తులను నిషేధించడం గమనార్హంయ నీటిలోనివసించే జంతువులు, పక్షుల మార్కెట్లు, జూలు, పౌల్ట్రీ ఫామ్‌లు మొదలైన చోట్ల నిఘా పెంచాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
3 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
4 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
6 hours ago

దేవినేని ఉమ విడుదల..!
8 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
8 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
8 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
11 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
12 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
14 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
15 hours ago
ఇంకా